NTV Telugu Site icon

తిరుమలలో మరింత తగ్గిన భక్తుల సంఖ్య…

ప్రస్తుతం ఏపీలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. దాంతో అక్కడ ప్రజలు బయటికి రావడం లేదు. అయితే ఈ కరోనా ఎఫెక్ట్ తిరుమల శ్రీవారి ఆలయంలో స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడ కరోనా కారణాన రోజురోజుకి భక్తులు సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పడుతుంది. అయితే నిన్న శ్రీవారిని ఐదు వేలకు పైగా భక్తులు దర్శించుకున్నారు. కానీ నిన్న శ్రీవారిని దర్శించుకున్న భక్తులు సంఖ్య 4,587 గా ఉంది. అలాగే తలనీలాలు సమర్పించారు 2,055 మంది భక్తులు. అయితే ఈ కరోనా కారణంగా శ్రీవారి ఆదాయం కూడా తగ్గిపోయింది. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 27 లక్షలకు తగ్గింది.