సికింద్రాబాద్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. చింతచెట్టునుంచి మంటలు రావడంతో కలకలం రేగింది. జీడిమెట్ల 31 బస్ స్టాప్ వుండే పాలికా బజార్ లో భారీ చింత చెట్టులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పెద్ద ఎత్తున పొగలు చిమ్ముతోంది చింత చెట్టు. దీంతో అక్కడ ఏం జరుగుతుందో తెలీక స్థానికులు ఆందోళనకు గురయ్యారు. చింతచెట్టు లోలప మంటలు అంటుకొని పొగలు కక్కుతోంది.
పక్కనే ఉన్న ఇళ్లలోకి దట్టమైన పొగలు చేరుకుంటున్నాయి. సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్న ఫైర్ సిబ్బందికి ఆటంకాలు ఎదురయ్యాయి. ముందుగా డి ఆర్ ఎస్ సిబ్బంది వచ్చినా వారి వద్ద ఎలాంటి ఫైర్ సేఫ్టీ పరికరాలు లేవు. ఫైర్ సిబ్బంది వచ్చినా చింత చెట్టుకు కరెంటు మీటర్ ఉండడంతో లైన్ మెన్ వచ్చే వరకు ఆగారు ఫైర్ సిబ్బంది. అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణం అయి వుండవచ్చంటున్నారు,