NTV Telugu Site icon

కోమటి చెరువు అభివృద్ధి అని చెప్పి కోట్లు దోచుకున్నారు…

తెరాస నాయకుల కు డబ్బులు అవసరం ఉంటే రోడ్లలను కూల్చి మళ్ళీ కట్టి డబ్బులు దండుకుంటున్నారు అని బండి సంజయ్ అన్నారు. కేంద్రం ఆర్థిక సంఘం నిధులు 30 కోట్ల40 లక్షల రూపాయల ఇచ్చింది. సిద్దిపేట లో  2799 ఇళ్లకు 137 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. సిద్దిపేట లో ఎన్ని డబుల్ బెడ్ రూమ్ దరఖాస్తులు వచ్చాయి, ఎంత మందికి ఇళ్ళు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం నిధులు  ఖర్చు చేసి, సిద్దిపేట ను అభివృద్ధి చేసాం అని గొప్పలు చెప్పుకుంటున్నారు. కోమటి చెరువు కోసం కోట్ల నిధులు అభివృద్ధి చేసాం అని చెప్పి కోట్ల రూపాయలు దోచుకున్నారు అని అన్నారు  బండి.  రాష్ట్రంలో తెరాస  ప్రభుత్వం ఉంది. అందుకే ఇక్కడ ఒక్క పరిశ్రమ లేదు ,ఒక్క ఉద్యోగం కూడా రాలేదు. మొదట హరీష్ రావును నీటి పారుదల శాఖ మంత్రిగా ఉంచి  తరువాత ఎందుకు ఆ పదవి నుండి తీసేసారు. హరీష్ రావుకు 50 రూపాయల పెట్రోల్ దొరికింది కానీ హరీష్ రావు కు 50 పైసలు అగ్గిపెట్టే దొరకలేదు అని తెలిపారు బండి. ఆయుష్మాన్ భారత్  ను రాష్ట్రంలో ఎందుకు అమలు చేయడం లేదు. రాష్ట్రంలో కరోనా బెడ్స్ కొరత తీవ్రంగా ఉంది ,కానీ ముఖ్యమంత్రికి కనీస నైతిక విలువలు లేకుండా పోయింది అని పేర్కొన్నారు.