Site icon NTV Telugu

Bhatti Vikramarka: రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు బుద్ధి చెబుతాం

Bhatti

Bhatti

ప్రజా సమస్యల పరిష్కారం కొరకై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపడుతున్న పీపుల్స్ మార్చ్ పాదయాత్ర గురువారం ఖమ్మం జిల్లాలోని ఎర్రుపాలెం మండలం మీనవోలు గ్రామంలోని అంకమ్మ దేవాలయం నుంచి పునఃప్రారంభించారు.  ఈ సందర్భంగా అంకమ్మ దేవాలయంలో ఆయన భార్య మల్లు నందిని భట్టి విక్రమార్క ప్రత్యేక పూజలు జరిపారు. గ్రామాల్లోని ప్రజలను పలకరిస్తూ వారి వ్యక్తిగత సమస్యలు వింటూ భట్టి విక్రమార్క పాదయాత్రను కొనసాగిస్తున్నారు.

KCR : తెలుగు రాష్ట్రాల్లో ముందస్తు ఎన్నికలు వస్తాయా.?ఆ అవసరం తెలుగు రాష్ట్రాల సీఎంలకు ఉందా.?

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు రెండు లక్షల రూపాయల రుణ మాఫీ చేస్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. రైతు కూలీలకు రూ.12,000 జమ చేస్తామని.. వరికి బోనస్ ప్రకటించి క్వింటాలుకు రూ.2500 ఇచ్చి కొనుగోలు చేస్తామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పేదలకు పంచిన భూములను ప్రభుత్వం వెనక్కి లాగేసుకుంటోందని భట్టి ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తప్పు చేస్తున్నావు జాగ్రత్త అంటూ ఆయన హెచ్చరించారు. రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు బుద్ధి చెబుతామని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

Exit mobile version