అరకు ప్రాంతానికి చెందిన ఓ యువతి, తన అక్కకు జరిగిన అన్యాయంపై చేసే పోరాటం నేపథ్యంలో రూపుదిద్దుకుంది ‘అరకులో విరాగో’ చిత్రం. దీన్ని గిరి చిన్నాదర్శకత్వంలో తోట సువర్ణ నిర్మించారు. ఈ సినిమా గురించి దర్శకుడు గిరి చిన్నా మాట్లాడుతూ, ” ‘విరాగో’ అంటే సంస్కృతంలో ‘మహిళా యోధురాలు’ అని అర్ధం. అందుకే ఈ పేరు పెట్టాం. రవీన్ ప్రగడ, పూజా చౌరాసియా హీరోహీరోయిన్లుగా నటించారు. ప్రముఖ నిర్మాత డి.ఎస్. రావు విలన్ పాత్ర పోషించారు. సెన్సార్ తో సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఈ నెల 13న విడుదల చేయబోతున్నాం” అని చెప్పారు.
నిర్మాత తోట సువర్ణ మాట్లాడుతూ “గిరి చిన్నా చెప్పిన కథ ఎంతగానో నచ్చి, అతన్ని దర్శకుడిగా పరిచయం చేస్తూ, నిర్మాతగా తొలియత్నం చేశాను. తనకు జరిగిన అన్యాయం గురించి ఫిర్యాదు చేయడానికి పోలీసుల్ని ఆశ్రయించిన ఓ యువతి అక్కడ కూడా తనకు అన్యాయమే జరగడంతో ఎలా తన ప్రతీకారం తీర్చుకుందనేది ఈ చిత్ర కథ. ఇదో ధీర వనిత సినిమా” అని అన్నారు. ఈ చిత్రానికి ఇమ్రాన్ శాస్త్రి పాటలు రాయగా, త్రినాథ్ మంతెన స్వరకల్పన చేశారు.