NTV Telugu Site icon

Samantha: చైతన్య తో ‘మజిలీ’.. విడాకుల తరువాత షేర్ చేసిన సామ్

Samantha

Samantha

అక్కినేని నాగ చైతన్యతో సమంత గతేడాది విడాకులు తీసుకున్న సంగతి తెల్సిందే. ఎంతో ఇష్టంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట నాలుగేళ్ళ తరువాత తమ వివాహ బంధానికి ఫుల్ స్టాప్ పెట్టారు. ఇక విడాకుల తరువాత ఎవరి దారి వారు చూసుకున్న ఈ జంట కెరీర్ మీదనే ఫోకస్ పుట్టిన సంగతి తెల్సిందే. చైతూ వరుస సినిమాలతో బిజీగా మారగా.. సామ్ సైతం ఒక పక్క సినిమాలతో మరోపక్క యాడ్స్ తో బిజీగా మారింది. ఇక విడాకుల తరువాత చైతూ జ్ఞాపకాలను తుడిచేస్తున్న సామ్ మొట్టమొదటిసారి చైతూ ఫోటోను షేర్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. మొన్నటి వరకు తన ఇన్స్టాగ్రామ్ లో ఉన్న చైతు ఫోటలను డిలీట్ చేసిన సామ్ నేడు చైతూ ఫోటోను ఇన్స్టా స్టోరీగా పెట్టింది. అయితే దినుకు కారణం కూడా లేకపోలేదు. ఈ జంట కలిసి నటించిన మజిలీ చిత్రం నేటితో  మూడేళ్లు పూర్తిచేసుకుంది.

శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా వరుస ప్లాపుల్లో ఉన్న చైతూ కు భారీ విజయాన్ని అందించింది. సామ్ కి మంచి పేరును తీసుకురావడమే కాకుండా అవార్డులను కూడా తీసుకొచ్చిపెట్టింది. ఇక మజిలీ తరువాత ఈ జంట పూర్తిగా కలిసి నటించింది లేదు. దీంతో ఈ సినిమా అంటే ప్రేక్షకులకు  ప్రేమ అని చెప్పాలి. ఇక ఈ విషయాన్ని సామ్ గుర్తుచేసింది. మజిలీ పోస్టర్ ని షేర్ చేస్తూ మజిలీకి మూడేళ్లు అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. అయితే మజిలీ లో అన్ని పోస్టర్ లు ఉండగా.. చైతూ ఒక్కడే ఉన్న పోస్టర్ ని పెట్టడంపై ఫ్యాన్స్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ చైతూతో మజిలీ మొదలుపెట్టాలనుకుంటుందా..? ఏంటి అని కామెంట్స్ పెడుతున్నారు.