సాధారణంగా వెండితెరపై కనిపించే నటీనటులు రియల్ కాదు.. కానీ వారు రియల్ గా జంట ఎలా ఉండాలో చూపిస్తారు.. ఒక హీరోహీరోయిన్ మధ్య రొమాన్స్, కెమిస్ట్రీ వర్క్ అవుట్ అయితే ప్రేక్షకులు వారే రియల్ కపుల్ అన్నట్లు చూస్తారు. అలాంటివారు ఎన్నిసార్లు వెండితెరపై కనిపించినా బోర్ ఫీలవ్వరు. అయితే ఒకే హీరో ఒకే హీరోయిన్ తో పనిచేయాలంటే ఎంతో కష్టం అంటారు కొందరు.. మరికొందరు ఒకసారి పనిచేసాకా రెండో సరి ఆ బెరుకు పోతుంది.. ఫ్రీగా పనిచేసుకోవచ్చు అని అంటుంటారు. ఇలా ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా.. ఒక హీరో ఒకే హీరోయిన్ తో 130 సినిమాల్లో నటించి గిన్నిస్ బుక్ రికార్డ్ కొట్టాడు.
అతడేమి హాలీవుడ్ హీరో కాదు.. బాలీవుడ్ హీరో కాదు..మలయాళ స్టార్ హీరో ప్రేమ్ నజీర్.. 1980 మరియు 90 ల్లో ఈ హీరోకున్న ర్యాంజ్ స్టార్ హీరోలకు కూడా ఉండదంటే అతిశయోక్తి కాదు .. దాదాపు 520 సినిమాల్లో కనిపించిన ప్రేమ్ నజీర్.. ఆయన నటించిన 130 సినిమాల్లో షీలా అనే హీరోయిన్ తో రొమాన్స్ చేశాడు.. 80 మంది హీరోయిన్లను రిపీట్ చేశాడు. ఒకే హీరోయిన్ ని 130 సార్లు రిపీట్ చేసిన హీరోగా ఆయన గిన్నిస్ బుక్ రికార్డ్ కూడా అందుకున్నాడు. ఇక ఏ జంట ఎప్పుడు తెరపై కనిపించినా అస్సలు బోర్ కొట్టాడని మలయాళ ఆడియెన్స్ కోడై కూస్తున్నారు.
వారు వెండితెరపై రొమాన్స్ చేస్తుంటే ఒరిజినల్ కపుల్ లానే ఉండేవారని, అందుకే వారిని చూసినప్పుడలా నిజజీవితంలో బార్యాభర్తలనే నమ్మేవాళ్లమని చెప్పుకొస్తున్నారు. ఏదిఏమైనా 130 సార్లు ఒకే హీరోయిన్ అంటే.. అందులోను పాత్రల మధ్య వైవిద్యం చూపిస్తూ చేయడమంటే కష్టమనే చెప్పాలి.. అందుకే ఆయనకు గిన్నిస్ బుక్ లో పేరు దక్కింది అని అంటున్నారు మలయాళ ప్రేక్షకులు.