Site icon NTV Telugu

ఈటలపై ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు.. ఇలాంటి గలిజు రాజకీయాలు చూడలేదు!

పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈటలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈటల భట్టితో మాట్లాడినప్పుడు కాంగ్రెస్ లోకి ఆహ్వానించామని..లెఫ్ట్ భావజాలాలు ఉండి బీజేపీలోకి ఎందుకు వెళ్ళాడో తెలియదని చురకలు అంటించారు. కేంద్ర రక్షణ కోసం ఈటల బీజేపీ వైపు వెళ్ళారని..ఎవరు అధికారంలో ఉంటే అటు పోవడం నాయకులకు అలవాటు అయ్యిందని ఫైర్ అయ్యారు. తెలంగాణలో బీజేపీ ఎక్కడ ఉందని.. సాగర్ లో ఎన్ని ఓట్లు వచ్చాయని నిలదీశారు. తెలంగాణలో ఇంత గలిజు రాజకీయాలు ఎప్పుడూ చూడలేదని..ఇలాంటి పరిస్థితి తాత్కా లికమన్నారు. 2023లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని..పార్టీలో నాయకుల మధ్య అభిప్రాయ బేధాలు సాధారణమని తెలిపారు. పిసిసి ప్రక్రియ జరుగుతుందని..త్వరలోనే మార్పు జరుగుతుందన్నారు. సోనియా, రాహుల్ గాంధీ నిర్ణయానికి కట్టుబడి ఉటామని.. ఏఐసీసీ పరిధిలో పిసిసి అంశం ఉందని పేర్కొన్నారు.

Exit mobile version