NTV Telugu Site icon

Unstoppable with NBK : యానిమల్ టీమ్ తో రచ్చ చేసిన బాలయ్య.. కొత్త ఎపిసోడ్ ప్రోమో వచ్చేసింది..

Unstopable

Unstopable

ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫారం ఆహా లో సక్సెస్ ఫుల్ టాక్ తో దూసుకుపోయిన ఏకైక షో అన్‌స్టాపబుల్.. స్టార్ హీరో బాలయ్య హోస్ట్ గా చేసిన ఈ షో ఎంత హిట్ అయ్యిందో తెలిసిందే.. రెండు సీజన్లను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుంది.. ఇక ఇటీవల సీజన్ 3 కూడా మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. దసరా కానుకగా అన్‌స్టాపబుల్ సీజన్ 3 ఫస్ట్ ఎపిసోడ్ ని రిలీజ్ చేశారు… ఆ ఎపిసోడ్ లో భగవంత్ కేసరి టీం కాజల్, శ్రీలీల, అర్జున్ రాంపాల్, అనిల్ రావిపూడి వచ్చి సందడి చేశారు.. ఆ ఎపిసోడ్ కూడా బాగా సక్సెస్ అయ్యింది..

ఇక త్వరలో ఇప్పుడు రెండో ఎపిసోడ్ రానుంది. ఈ సారి అన్‌స్టాపబుల్ టాలీవుడ్ రేంజ్ దాటి బాలీవుడ్ కి వెళ్ళింది.. రెండో ఎపిసోడ్ లో యానిమల్ సినిమా టీం నుంచి సందీప్ వంగ, రణబీర్ కపూర్, రష్మిక మందన్నా వచ్చి సందడి చేశారు. తాజాగా ఈ ఎపిసోడ్ ప్రోమోని విడుదల చేశారు.. ఈ ఎపిసోడ్ లో బాలయ్య మాములుగా రచ్చ చెయ్యలేదు.. రణబీర్, రష్మిక లతో కలిసి డ్యాన్సులు వేశారు. సరదా ప్రశ్నలు అడిగారు. రష్మికతో విజయ్ కి కాల్ చేయించారు.. ఈ ప్రోమో మొత్తం చాలా సరదాగా సాగింది.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..

ఈ ప్రోమోలో బాలయ్య చేసిన హంగామా మాములుగా లేదు.. ఇక ఎపిసోడ్ లో రచ్చ ఏ రేంజ్ లో ఉంటుందో అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ ఎపిసోడ్ నవంబర్ 24న ఆహాలో ప్రీమియర్ అవ్వనుంది. ఇక యానిమల్ సినిమా నుంచి ఇప్పటికే సాంగ్స్, టీజర్ రిలీజ్ చేసి అంచనాలు పెంచారు. ఇకపోతే ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ డిసెంబర్ 1న విడుదల కాబోతుంది..