Two Gunmens For a Street Vendor in Uttar Pradesh.
అతడో సామాన్య వ్యక్తి.. తాను చేసిది తోపుడి బండిపై బట్టలు అమ్ముకోవడం. అయితే.. అతని వెనుక ఇద్దరు గన్‌మెన్లు ఏకే 47 రైఫిళ్లతో భద్రత కల్పిస్తున్నారు. ఆ వ్యక్తిని చూసిన ప్రతి ఒక్కరి ఇదేంటనీ ఆశ్చర్యం కలగక మానదు. అసలు విషయం ఏటంటే.. ఉత్తరప్రదేశ్‌లోని ఎటా జిల్లాకు చెందిన రామేశ్వర్ దయాళ్ అనే వ్యక్తి తోపుడు బండిపై వస్త్రాలు విక్రయిస్తూ జీవిస్తున్నాడు. అయితే.. ఇటీవల సమాజ్‌వాదీ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే రామేశ్వర్‌సింగ్ సోదరుడు జుగేంద్రసింగ్‌ను కలిసి తన భూమికి పట్టా ఇప్పించాలని రామేశ్వర్ దయాళ్ కోరాడు. ఈ క్రమంలోనే రామేశ్వర్ దయాళ్ కు జుగేంద్రసింగ్‌కు మధ్య వివాదం చెలరేగింది. అయితే ఈ నేపథ్యంలో జుగేంద్ర సింగ్ నన్ను కులం పేరుతో దూషించాడంటూ రామేశ్వర్ దయాళ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రామేశ్వర్ దయాళ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేయడంతో.. ఆ కేసు కోర్టులో విచారణకు వచ్చింది.. ఈ క్రమంలోనే జుగేంద్ర సింగ్ విచారణకు కోర్టుకు హాజరయ్యారు.
Data Phishing : ఈ ప్లాట్‌ఫారమ్ ద్వారానే ఎక్కువగా డేటా దొంగతనం..
అలాగే రామేశ్వర్ దయాళ్ సైతం కోర్టుకు రావాలని సూచించడంతో.. రామేశ్వర్ దయాళ్ ఒక్కడే కోర్టుకు ముందుకు వచ్చాడు. దీంతో రామేశ్వర్ దయాళ్ కు ఎందుకు భద్రత కల్పించలేదని పోలీసులను కోర్టు ప్రశ్నించింది. అంతేకాకుండా రామేశ్వర్ దయాళ్ కు వెంటనే బాడీగార్డులను నియమించాలని కోర్టు ఆదేశించింది. దీంతో రామేశ్వర్ దయాళ్ కు పోలీసులు ఇద్దరు గన్‌మెన్‌లను నియమించింది. అయితే.. సామాన్యుడైన రామేశ్వర్ దయాళ్ రోజువారీలాగా తోపుడు బండిపై బట్టలు అమ్ముతుండగా ఇద్దరు గన్‌మెన్ ఆయన పక్కనే ఉండి భద్రత కల్పిస్తున్న ఫోటోలు ప్రస్తుతుం నెట్టింట వైరల్ గా మారాయి.
