NTV Telugu Site icon

Viral Video: విరాట్‌ కోహ్లీని చూడగానే అతడి చేతిని పట్టుకుని మహిళ ఏం చేసిందో చూడండి(వీడియో)

Virat

Virat

తమ అభిమాన తారను కళ్ల ముందు చూసిన ఫ్యాన్స్ తమ భావోద్వేగాలను అదుపు చేసుకోలేకపోతున్నారు. అలాంటి ఒక క్లిప్ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఓ మహిళ విరాట్ కోహ్లీతో సెల్ఫీ తీసుకునేందుకు తహతహలాడుతున్నట్లు కనిపిస్తోంది. ఆమె కంగారు పడుతూ కనిపించింది. ఈ క్లిప్‌ను చూసిన.. వినియోగదారులు ఒకవైపు విరాట్ కోహ్లీని ప్రశంసిస్తూనే.. మరోవైపు, విరాట్‌తో ఇలా ప్రవర్తించవద్దని ఆ మహిళకు సలహా ఇస్తున్నారు.

READ MORE:4B movement: ‘‘మీతో సె*క్స్ చేయం’’.. ట్రంప్ గెలుపుకి మగాళ్లని నిందిస్తున్న మహిళలు..

వీడియోలో ఏముందంటే…
ఈ వీడియోలో ఓ మహిళ విరాట్‌ను చూసిన వెంటనే అతడితో సెల్ఫీ దిగాలని కోరికను వ్యక్తం చేసింది. విరాట్ ఆమె మాట విని ఆగిపోయాడు. కానీ మహిళ ఫోన్ తీసి సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది. అంతలో కంగారు పడుతుంది. దీంతో విరాట్ సెల్ఫీ తీసుకోకుండానే వెళ్లిపోతాడేమోనని ఆమె భయపడుతుంది. అటువంటి పరిస్థితిలో మహిళ కోహ్లీ చేతిని గట్టిగా పట్టుకుంది. ఈ సంఘటనతో విరాట్ అసౌకర్యంగా ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ.. ఫొటో దిగేంత వరకు వేచి చూశాడు. మహిళ ఫోన్ కెమెరా త్వరగా ఓపెన్ కాకపోవడంతో అక్కడ నిలబడి ఉన్న ఫొట్రోగ్రాఫర్లు ఆమె ఫోటోను క్లిక్ చేశారు. ఆ తర్వాత విరాట్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దాదాపు 28 సెకన్ల ఈ క్లిప్ ఇంతటితో ముగుస్తుంది.

READ MORE:WHO warns: గాజాలో కరవు విలయతాండవం.. తక్షణమే సాయం పెంచాలంటూ డబ్ల్యూహెచ్‌వో వార్నింగ్

అయితే ఈ వీడియో కామెంట్ సెక్షన్‌లో యూజర్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. వినియోగదారులు విరాట్ కోహ్లీ సింప్లీసిటీని ప్రశంసించారు. విరాట్ కోహ్లి తన అభిమానులపై ప్రేమను చూపించడానికి ఎప్పుడూ వెనుకాడడు అని ఒక వ్యక్తి కామెంట్ చేశాడు. వీడియో అతని ప్రవర్తన, తన అభిమానులతో కనెక్ట్ అవ్వడానికి చూయిస్తుందని పలువురు కామెంట్ చేశారు. దయచేసి విరాట్ ప్రైవసీని గౌరవించండి అమ్మా.. ఇలా చేతులు పట్టుకోవడం మంచిది కాదని మరో యూజర్ రాశారు.

Show comments