Site icon NTV Telugu

Viral Video: హెల్మెట్ లేదని ఆపిన ట్రాఫిక్ పోలీసులు.. వాహనదారుడు ఏం చేశాడో తెలుసా..!

Bikist

Bikist

కారులో కానీ, బైక్ పై వెళ్తున్నప్పుడు నిబంధనలను పాటించడం తప్పనిసరి. అయితే ఈ నిబంధనలను పాటించకుండా వాహనంతో రోడ్డుపైకి వెళ్లే వారు చాలా మంది ఉన్నారు. అలాంటి సమయంలో పోలీసులు గానీ, ట్రాఫిక్‌ పోలీసులు గానీ అడ్డుకుంటే వారితో వాగ్వాదానికి దిగారు. తాజాగా వీడియోనే ఇప్పుడు ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బెంగళూరులోని విల్సన్ గార్డెన్ వద్ద తనిఖీలు చేపట్టిన ఓ ట్రాఫిక్ పోలీసుకు చేదు అనుభవం ఎదురైంది. ముందు ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేస్తు్న్నారని గమనించి వస్తుండగా.. సయ్యద్ షఫీ అనే వ్యక్తి హెల్మెట్ లేకుండా పోలీసులకు దొరికాడు. దీంతో ఆ వ్యక్తి భయపడి ట్రాఫిక్ పోలీస్ వేలు కొరికాడు.

Read Also: Weight Gain: సన్నగా ఉన్నారని బాధపడుతున్నారా.. ఇవి తినండి 2 వారాల్లో బరువు పెరుగుతారు..!

ఓ కానిస్టేబుల్ అతడి స్కూటర్ తాళాలు లాగేసుకోగా, ఈ సన్నివేశాన్ని మరొక కానిస్టేబుల్ తన ఫోన్ లో రికార్డు చేశాడు. దీంతో పోలీసులపై మండిపడ్డాడు. తాను హాస్పిటల్ కు వెళ్తున్నానని.. వెళ్లనివ్వండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ వీడియో తీస్తున్న కానిస్టేబుల్ నుంచి ఫోన్ లాక్కునే ప్రయత్నం చేశాడు. ఎందుకు రికార్డ్ చేస్తున్నారు? అంటూ ఫైర్ అయ్యాడు. ఆ తర్వాత ఎలాగోలాగా అక్కడ్నించి పారిపోయేందుకు ప్రయత్నించాడు. కానీ ట్రాఫిక్ పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీసును దూషించడని, గాయపర్చాడని, బెదిరింపులకు పాల్పడ్డాడని అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా.. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Read Also: Sai Dharam Tej: ఇది నా రెండో జన్మ.. అందరు దాన్ని మర్చిపోతున్నారు

Exit mobile version