Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
- థాయ్‌లాండ్‌లో చర్చకు దారితీసిన ‘అద్దె భార్యల’ వ్యవహారం
- విదేశీ పర్యాటకులతో తాత్కాలిక ఒప్పందాలంటూ ప్రచారం
- గ్రామీణ పేదరికం, ఆర్థిక అవసరాలే కారణాలా?
- మహిళల హక్కులు, భద్రతపై పెరుగుతున్న ఆందోళనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షించే అందాల థాయ్‌లాండ్‌లో దశాబ్దాలుగా గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఓ చీకటి సంస్కృతి ఇప్పుడు ప్రపంచ దేశాలను విస్మయానికి గురిచేస్తోంది. విదేశీ పర్యాటకుల కోసం స్థానిక నిరుపేద మహిళలను నిర్ణీత కాలానికి ‘అద్దె భార్యలు’గా మార్చే దందా అక్కడ యథేచ్ఛగా కొనసాగుతోంది. ప్రముఖ పర్యాటక కేంద్రమైన పట్టాయా కేంద్రంగా వేళ్లూనుకున్న ఈ అనధికారిక వ్యవహారంపై రచయిత్రి లా వెరిటే ఇమ్మాన్యుయెల్ వెలువరించిన ‘థాయ్‌లాండ్స్ టాబూ: ది రైజ్ ఆఫ్ వైఫ్ రెంటల్ ఇన్ మోడర్న్ సొసైటీ’ అనే సంచలన పుస్తకం ఈ అమానుష నిజాలను మరోసారి బట్టబయలు చేసింది.
స్థానికంగా ‘బ్లాక్ పెర్ల్’ లేదా ‘వైఫ్ ఫర్ హైర్’ ఒప్పందాలు
థాయ్‌లాండ్‌లో ఈ తాత్కాలిక బంధాన్ని స్థానికంగా ‘వైఫ్ ఫర్ హైర్’ (Wife for Hire) లేదా ‘బ్లాక్ పెర్ల్’ అని పిలుస్తారు. ఇది ఎలాంటి చట్టబద్ధమైన వివాహం కాదు.. కేవలం పర్యాటకుడికి, ఆ మహిళకు మధ్య కుదిరే ఒక ప్రైవేట్ కాంట్రాక్ట్ మాత్రమే. ఈ ఒప్పందం అమల్లో ఉన్నంత కాలం సదరు మహిళ ఆ విదేశీ టూరిస్టుతో భార్యలాగే కలిసి జీవించాల్సి ఉంటుంది. పర్యాటకుడు తిరిగే ప్రదేశాలకు టూర్ గైడ్‌గా వ్యవహరించడం, వంట చేయడం, ఇంటి పనులు చూసుకోవడంతో పాటు దాంపత్య విధులను కూడా నిర్వర్తించడం ఈ ఒప్పందంలో భాగం. ఒకవేళ పర్యాటకుడికి ఆ మహిళ ప్రవర్తన నచ్చితే, ఒప్పందం ముగిసిన తర్వాత ఆమెను శాశ్వతంగా వివాహం చేసుకునే వెసులుబాటు కూడా ఉంటుంది.
Also Read
- Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
- Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
- EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
- Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
గ్రామీణ పేదరికమే మూలకారణం.. లక్షల్లో రేట్లు
ఈ అద్దె భార్యల దందా వెనుక తీవ్రమైన ఆర్థిక అసమానతలు, కుటుంబ పోషణ భారాలే ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. థాయ్‌లాండ్‌లోని మారుమూల గ్రామీణ ప్రాంతాలకు చెందిన నిరుపేద యువతులు ఉపాధి వెతుక్కుంటూ పట్టాయా, బ్యాంకాక్ వంటి నగరాలకు వస్తుంటారు. నైట్‌క్లబ్‌లు, రెడ్‌లైట్ జోన్లలో పనిచేసే వీరికి.. ధనిక విదేశీ పర్యాటకులు తారసపడినప్పుడు భారీ మొత్తంలో డబ్బు ఆశ చూపి ఇలా అద్దె భార్యలుగా మార్చుకుంటున్నారు. ఈ దందాలో మహిళల వయస్సు, రూపం, విద్యార్హతలు , వారు కేటాయించే సమయాన్ని బట్టి రేట్లు మారుతుంటాయి. ఈ తాత్కాలిక ఒప్పందం కోసం పర్యాటకులు దాదాపు 1,600 డాలర్ల నుంచి ఏకంగా 1,16,000 డాలర్ల వరకు (భారత కరెన్సీలో లక్షల నుంచి కోట్ల రూపాయల వరకు) ముట్టజెప్పుతుండటం గమనార్హం.
నియంత్రణ లేకపోవడంతో పెరుగుతున్న ఆందోళనలు
ఆధునిక జీవితంలో ఒంటరితనం, తీరికలేని జీవనశైలి పెరగడంతో చాలామంది విదేశీ పర్యాటకులు దీర్ఘకాలిక బంధాల కంటే ఇలాంటి తాత్కాలిక ఏర్పాట్ల వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అయితే, థాయ్‌లాండ్‌లో ప్రస్తుతం ఈ అసాంఘిక పద్ధతిని అడ్డుకునేందుకు ఎలాంటి ప్రత్యేక చట్టాలు లేవు. పర్యాటక రంగం ముసుగులో సాగుతున్న ఈ దందా దేశ అంతర్జాతీయ ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీస్తోందని మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో థాయ్ ప్రభుత్వం తక్షణమే స్పందించి, కఠినమైన చట్టాలు తెచ్చి ఈ అద్దె భార్యల సంస్కృతిని అణచివేయాలని స్థానిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
తాజావార్తలు
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
-
Smriti Mandhana: బాలల హక్కుల కోసం స్మృతి మంధాన ముందడుగు.. ఆహ్వానించిన సచిన్ టెండూల్కర్..
-
Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
-
Rajinikanth: బాషా 2.. పేట 2 వద్దని.. జైలర్ 2కి తలైవా ఎందుకు ఒప్పుకున్నారు?
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..