వరల్డ్స్ లాంగెస్ట్ హెయిర్ ఈ గుజరాత్ అమ్మాయిదే… 12 ఏళ్లలో తొలిసారిగా కటింగ్…!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గుజరాత్లోని మోడాసాకు చెందిన నీలాంషి పటేల్ వరల్డ్స్ లాంగెస్ట్ హెయిర్ కలిగిన అమ్మాయిగా గిన్నిస్ రికార్డు ను సొంతం చేసుకుంది. 2018లో యుక్తవయసులో పొడవైన జుట్టు కలిగిన అమ్మాయిగా నీలాంషి వరల్డ్స్ లాంగెస్ట్ హెయిర్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ టైటిల్ ను గెలుచుకుంది. ఆ సమయంలో ఆమె వయసు 16 సంవత్సరాలు. ఆమె జుట్టు 170.5 సెంటీమీటర్లు ఉంది. నీలాంషి తన 18వ పుట్టినరోజుకు ముందే జూలై 2020లో చివరిసారిగా జుట్టును కొలిచింది. ఇది 200 సెంటీమీటర్ల పొడవుకు చేరుకుంది. ఇంకేముంది తన రికార్డును తానే మరోసారి బ్రేక్ చేసింది. అయితే తాజాగా ఈ గుజరాత్ రెపాంజల్ 12 సంవత్సరాల తరువాత మొదటిసారిగా తన జుట్టును కట్ చేసింది. నీలాంషి హెయిర్ కట్ ను డాక్యుమెంట్ చేసిన ఒక నిమిషం నిడివి గల వీడియోను ఇన్స్టాగ్రామ్లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ షేర్ చేసింది. హెయిర్ కట్ కు ముందు “నా జుట్టు నాకు చాలా ఇచ్చింది. కానీ దానిని తగ్గించే సమయం వచ్చింది. నేను మిమ్మల్ని చాలా కోల్పోతాను, మిత్రమా” అంటూ నీలాంషి ఎమోషనల్ అయ్యింది. నీలాంషికి కట్ చేసిన జుట్టును ఏం చేయాలనే దానికి మూడు ఆప్షన్లు ఉన్నాయి. వేలం వేయడం, క్యాన్సర్ రోగుల కోసం స్వచ్ఛంద సంస్థకు విరాళం ఇవ్వడం లేదా మ్యూజియంకు విరాళం ఇవ్వడం. అయితే నీలాంషి ఆమె తల్లి సలహా ప్రకారం రికార్డ్స్ క్రియేట్ చేసి స్ఫూర్తిదాయకంగా నిలిచిన ఈ జుట్టును మ్యూజియానికి విరాళంగా, క్యాన్సర్ రోగులకు దానం కూడా చేస్తానని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం నీలాంషి హెయిర్ కట్ కు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
https://www.instagram.com/reel/CNpBuhNBUwF/?utm_source=ig_embed
Also Read
- Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
- Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ 'జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు'.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
- Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
- Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
తాజావార్తలు
-
Pakistan: పీఓకేపై వార్తలు.. అల్ జజీరాపై పాకిస్తాన్ ఆంక్షలు..
-
Varanasi: తెలుగు మీడియాని లైట్ తీసుకున్న జక్కన్న
-
Iran-US War: అమెరికాపై ఇరాన్ వ్యూహం మారిందా? కొత్త లక్ష్యం ఇదేనా!
-
FSSAI: మందు బాబులకు బిగ్ అలర్ట్.. ఈ విస్కీ, రమ్ బాటిళ్లు ఇక దొరకవా?
-
Kodali Nani: గుడివాడలో డీఎస్సీ అక్రమాలపై వైసీపీ సమావేశం.. కొడాలి నాని తీవ్ర ఆరోపణలు
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!