Site icon NTV Telugu

క్రేజీ బ్యూటీ సీక్రెట్ బయటపెట్టిన తమన్నా

Tamannah says 'morning saliva' actually works on skin

మిల్కీ బ్యూటీ తమన్నా తాజాగా బయట పెట్టిన షాకింగ్ బ్యూటీ సీక్రెట్ చర్చనీయాంశంగా మారింది. గత దశాబ్ద కాలంగా సౌత్ ప్రేక్షకులను అలరిస్తున్న ఈ బ్యూటీకి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పటికి చెక్కు చెదరని తన అందంతో అప్ కమింగ్ హీరోయిన్లకు పోటీనిస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడు మాస్ట్రో చిత్రంతో పాటు ఎఫ్3 చిత్రంలో నటిస్తోంది. ఇటీవల డిస్నీ + హాట్‌స్టార్ సిరీస్ “నవంబర్ స్టోరీ”లో కనిపించిన తమన్నా… తెలుగులో ఓ వంట కార్యక్రమానికి హోస్ట్‌గా ఆమె టెలివిజన్‌ రంగంలోకి అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉంది. తాజాగా తమన్నా ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ గ్లామర్ సీక్రెట్ చెప్పేసి అందరికీ షాకిచ్చింది.

Also Read : అప్పుడే ట్రెండ్ సృష్టిస్తున్న మహేష్ ఫ్యాన్స్…!

ఈ ఇంటర్వ్యూలో మీ అందం వెనుక రహస్యం ఏమిటని ప్రశ్నించగా… లాలాజలం అని ఏమాత్రం తడుముకోకుండా చెప్పేసింది. ముఖంపై మొటిమలు రాకుండా ఉండడానికి లాలాజలం బాగా ఉపయోగపడుతుందట. ఉదయం లేవగానే తన లాలాజాలం (సలైవా)ను ముఖానికి అప్లై చేస్తానని చెప్పింది ఈ మిల్కీ బ్యూటీ. సలైవా స్కిన్ ప్రాబ్లమ్స్ ను బాగా క్లియర్ చేస్తుందని క్రేజీ ఆన్సర్ ఇచ్చింది తమన్నా.

Exit mobile version