Site icon NTV Telugu

ఫేస్‌బుక్ లైవ్‌లో టీవీ నటుడు ఆత్మహత్యాయత్నం..

చైనాలో పుట్టిన కరోనా వైరస్ అన్ని దేశాలను అతలాకుతలం చేస్తున్నది. ముఖ్యంగా పేద ప్రజల జీవనోపాధిని కోల్పోయేలా చేసింది ఈ మహమ్మారి. ఈ వైరస్ కారణంగా చాలా మంది పేద ప్రజలు తమ ఉపాధిని కోల్పోయి రోడ్డున పడ్డారు. అంతేకాదు చాలా మంది ఆకలి చావులకు గురవుతున్నారు. అటు ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా సినీ పరిశ్రమపై కూడా పడింది. షూటింగ్స్ లేకపోవడంతో సినీ కార్మికులు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా బెంగాలీ నటుడు సువో చక్రవర్తి అవకాశాలు రాక, దాని వలన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి తలెత్తడంతో ఫేస్బుక్ లైవ్ లో సూసైడ్ ప్రయత్నం చేశాడు. బెంగాలీలో “మంగళ చాంది” మరియు “మానస” వంటి సీరియల్స్ తో అక్కడ ప్రేక్షకులకు దగ్గరైన చక్రవర్తి జూన్ 8న అంటే మంగళవారం రోజున అభిమానులతో చిట్ చాట్ చేస్తూ.. సడన్ గా స్లీపింగ్ టాబ్లెట్స్ మింగేశాడు. ఇది చూసిన ఆయన ఫ్రెండ్స్ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అతన్ని ఆస్పత్రిలో చేర్చి ప్రాణాలు కాపాడారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం కుదుటపడింది. ఆర్థిక ఇబ్బందుల వల్లనే అతను ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు పేర్కొన్నారు.

Exit mobile version