Site icon NTV Telugu

ఆ వ్య‌క్తి.. విష సర్పాన్ని కొరికి చంపేశాడు… ఎందుకంటే…

పాము క‌నిపిస్తే దూరంగా పరుగులు తీస్తాం.  పాము కాటేస్తే వెంట‌నే ఆసుపత్రికి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకుంటాం.  కానీ, ఓ వ్య‌క్తి మాత్రం త‌న‌ను కాటేసిన పామును వెతికి ప‌ట్టుకొని దానికి నోటితో కొరికి చంపేశాడు.  ఆ త‌రువాత తీరిగ్గా నాటు వైద్యుడి వ‌ద్ద‌కు వెళ్లి మందు తీసుకున్నాడు.  ఈ సంఘ‌ట‌న ఒడిశా లోని జాజ్‌పూర్ జిల్లాలో జ‌రిగింది.  జాజ్‌పూర్ జిల్లా గంభారిప‌టియా గ్రామానికి చెందిన కిషోర్ భ‌ద్రా అనే వ్య‌క్తి పోలంలో ప‌నిచేస్తుండ‌గా ర‌క్త‌పింజ‌రి పాము క‌రిచింది.  త‌న‌ను పాము క‌రిచింద‌ని గుర్తించిన కిషోర్ ఆ పామును వెతికి ప‌ట్టుకున్నాడు.  త‌నను క‌రిచిన ఆ పామును కొపంతో కొరికి చంపేశాడు.  అక్క‌డితో ఆగ‌కుండా ఆ పామును ఇంటికి తీసుకొచ్చి భార్య‌కు చూపి జ‌రిగిన విష‌యం చెప్పాడు.  విష‌యం గ్రామంలో తెలియ‌డంతో చుట్టుప‌క్క‌ల‌వారు వ‌చ్చి ఆసుప‌త్రికి వెళ్లాల‌ని సూచించారు.  తాను నాటు వైద్యం తీసుకున్నాన‌ని, బాగానే ఉన్నాన‌ని చెప్పాడు కిషోర్ భ‌ద్ర‌.  ఈ న్యూస్ ఇప్పుడు ఒడిశాలో వైర‌ల్‌గా మారింది.  

Read: ది బ్రిడ్జ్ ఆన్ ది రివర్ క‌వాయ్‌…చూసి తీరాల్సిందేనోయ్‌… ఎందుకంటే…!!

Exit mobile version