Ugadi 2024: ఉగాది పండుగను ఎందుకు జరుపుకుంటారో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగువారి మొదటి పండుగ ఉగాది. అందుకే ఈ పండుగను తెలుగు సంవత్సరాదిపండుగ అని పిలుస్తారు. ప్రతి సంవత్సరం ఛైత్ర మాసం శుక్ల పక్షం పాడ్యమి తిథి నాడు తెలుగు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది.. ప్రతి ఏడాది మార్చి, ఏప్రిల్ నెలలో వస్తుంది.. ఈ ఏడాదిలో ఏప్రిల్ 9 న వచ్చింది. ఈసారి వచ్చే ఏడాదిని శ్రీ క్రోధి నామ సంవత్సరం అంటారు. దీని అర్థం ఏంటంటే.. ఈ ఏడాది క్రొధమును ఎక్కువగా కలిగి ఉంటారు.. కుటుంబం, మనుషులు మధ్య కోపాలు, యుద్దాలు జరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయని పండితులు చెబుతున్నారు.. ఇక ఈ పండుగ గురించి మరిన్ని విషయాలను తెలుసుకుందాం..
యుగాది లేదా ఉగాది అనే పదాలు ‘యుగ’ (యుగం) మరియు ‘ఆది’ (ప్రారంభం) అనే సంస్కృత పదాల నుండి ఉద్భవించాయి, ఇది ‘కొత్త యుగం ప్రారంభం’ అని సూచిస్తుంది. మాములుగా గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం మార్చి చివరలో లేదా ఏప్రిల్ ప్రారంభంలో వచ్చే ఈ రోజు హిందువులకు చారిత్రక మరియు సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. మహారాష్ట్రలో గుడి పడ్వా, తెలుగు రాష్ట్రాల్లో ఉగాది అని,కర్ణాటకలో యుగాది వంటి పేర్లతో ఉగాది పండుగను జరుపుకుంటారు.. పురాణాల ప్రకారం.. బ్రహ్మ దేవుడు విశ్వాన్ని సృష్టించాడు. తరువాత అతను రోజులు, వారాలు, నెలలు మరియు సంవత్సరాలను సృష్టించాడు.. ఇదే సంవత్సరానికి ఆది పర్వం అని అంటారు..
Also Read
- Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
- ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
- The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో 'నాని' విజ్ఞప్తి.!
- మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
ఇకపోతే ఈ పండుగను అందరు జరుపుకుంటారు.. ఈ పండుగ మొదలయ్యే వారం ముందు నుంచి సందడి మొదలవుతుంది.. ఉగాది పండుగను కూడా సంక్రాంతి లాగే ఘనంగా ఎవరికీ ఉన్నంతలో వాళ్లు జరుపుకుంటారు.. ఈరోజు ఎం చెయ్యాలంటే.. సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి గుమ్మానికి మామిడాకుల తోరణాలు కట్టాలి. తలకు నువ్వుల నూనె పట్టించి నలుగు పెట్టుకుని స్నానం చేసి, కొత్త బట్టలు లేదా శుభ్రమైన దుస్తులు ధరిస్తారు.. పాయసం, పులిహోర తో పాటుగా బొబ్బట్లను కూడా తప్పనిసరిగా చేసుకొని దేవుడికి సమర్పించి, ఉగాది పచ్చడిని కూడా చేసుకొని ఇంటిల్లి పాది ఆనందంగా ఆరగిస్తారు..
తాజావార్తలు
-
Joe Root Record: 36 ఏళ్ల వయసులోనూ రూట్ తగ్గేదేలే.. సచిన్ టెండూల్కర్ రేర్ రికార్డు బ్రేక్!
-
Varanasi : ‘వారణాసి’లో తన షూటింగ్ పార్ట్ పూర్తి చేసిన మహేశ్ బాబు
-
Motorola Signature 27: మోటరోలా సిగ్నేచర్ 27 లాంచ్.. 200MP కెమెరా, Gemini AI, Bang & Olufsen ఆడియో ఫీచర్స్
-
Rubik’s Cube World Record: 6 ఏళ్ల చిన్నారి అద్భుతం.. 4.27 సెకన్లలో రూబిక్స్ క్యూబ్ సాల్వ్ చేసి ప్రపంచ రికార్డు
-
CM Reply: ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ‘ది పారడైజ్’ చూడాలన్న నాని.. సీఎం రేవంత్ రిప్లై ఇదే.!
ట్రెండింగ్
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!