NTV Telugu Site icon

Samantha : షార్ట్ హెయిర్‏తో క్యూట్‏గా,హాట్ గా కనిపిస్తున్న సమంత..

Samantha (2)

Samantha (2)

తెలుగు స్టార్ హీరోయిన్ సమంత విదేశాలకు వెళ్లేందుకు రెడీ అవుతుంది..ఇటీవలే ఖుషి, సిటాడెల్ చిత్రీకరణలు పూర్తిచేసిన ఆమె.. కొద్ది రోజులుగా కోయంబత్తూరులోని సద్గురు ఇషా ఫౌండేషన్‏లో గడుపుతున్నారు.. కొద్ది రోజుల్లో తన వ్యాధికి చికిత్స తీసుకోవడం కోసం అమెరికాకు వెళ్ళబోతుంది.. అందుకే ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ తీసుకుంది.. కొత్త సినిమాలకు తీసుకున్న అమౌంట్ ను కూడా తిరిగి వెనక్కి ఇచ్చేసింది..అయితే కొద్ది రోజులుగా నెట్టింట సైలెంట్ అయిన సామ్.. తాజా సరికొత్త లుక్‏లో కనిపించి ఆశ్చర్యపరిచింది. హెయిర్ పూర్తిగా కట్ చేసి.. షార్ట్ హెయిర్‏తో క్యూట్‏ లుక్ లో కనిపించింది.

తాజాగా ఆమె తన ఇన్ స్టాలో షేర్ చేసిన వీడియోలో బీచ్ వద్ద షార్ట్ హెయిర్‏తో చిరునవ్వులు చిందిస్తూ కనిపించింది. ఆ వీడియోలో సామ్ ఎంతో క్యూట్ అండ్ ప్రెటీగా కనిపిస్తూ అభిమానులను ఫిదా చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరలవుతుండగా.. సామ్ ఎంతో అందంగా ఉందని అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక సామ్ న్యూలుక్ పై హీరోయిన్ హన్సిక స్పందిస్తూ.. సమంత ఎప్పటికీ అందంగా ఉంటుందంటూ కామెంట్ చేసింది. మొత్తానికి తన న్యూలుక్‏తో ఫ్యాన్స్‏ను ఆశ్చర్యపరిచింది సామ్..

ఇక సమంత విజయ్ దేవరకొండ జంటగా నటించిన లేటేస్ట్ చిత్రం ఖుషి. డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ త్వరలోనే అడియన్స్ ముందుకు రానుంది. ఇప్పటికే ఈ నుంచి విడుదలైన సాంగ్స్ మాత్రం ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఇందులో విజయ్, సామ్ కెమిస్ట్రీ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది.. ఇటీవల రిలీజ్ అయిన సాంగ్ ఎంతగా వైరల్ అయ్యిందో చెప్పనక్కర్లేదు..సమంత సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటోంది. తాను ఎక్కడికి వెళ్లినా ఆ విశేషాలని ఫ్యాన్స్ తో పంచుకుంటోంది. తాజాగా సమంత లేటెస్ట్ లుక్ మైండ్ బ్లోయింగ్ అనిపించే విధంగా ఉంది. ఈ మేరకు సామ్ ఇంస్టాగ్రామ్ లో వీడియో షేర్ చేసింది. ఈ వీడియోలో సమంత బబ్లీగా ఉంటూ హాట్ నెస్ తో పిచ్చెక్కిస్తోంది అనే చెప్పాలి.. అందంగా నవ్వుతూ స్కిన్ షో చేస్తూ సామ్ ఇస్తున్న ఫోజుకి యువత ఫిదా కావలసిందే. అంత క్రేజీగా సమంత వీడియో ఉంది..