NTV Telugu Site icon

బుద్ధి ఉందా ? ఇది గుడి… రిపోర్టర్ పై సామ్ గరం గరం

Samantha Fires on Journalist at Tirumala

ఇప్పుడు టాలీవుడ్ దృష్టి మొత్తం అక్కినేని ఫ్యామిలీ విషయంపైనే ఉంది. నాగ చైతన్యతో సమంత విడాకుల విషయం గత కొన్ని రోజులుగా ఎటూ తేలడం లేదు. ఇక పుకార్లకైతే కొదవే లేదు. అయితే ఆ పుకార్లకు తగ్గట్టుగానే చై, సామ్ ప్రవర్తన ఉండడం అక్కినేని అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. మీడియా దృష్టిని తప్పించుకోవడానికి సామ్ గత కొన్ని వారాలుగా హైదరాబాద్‌కు దూరంగా ఉంటోంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది. కానీ రూమర్స్ విషయమై సామ్, చై ఇద్దరూ సైలెంట్ గానే ఉన్నారు. ఇటీవల “లవ్ స్టోరీ” టీంకు సామ్ విష్ చేయడం, నాగ చైతన్య రిప్లై ఇవ్వడం కూడా చర్చల్లో భాగమయ్యాయి. ఆ తరువాత “లవ్ స్టోరీ” ప్రమోషన్లలో సామ్ విషయం మాట్లాడొద్దని నాగ చైతన్య చెప్పినట్టు వార్తలు వచ్చాయి.

Read Also : శ్రీకాళహస్తిలో సమంత వరుస పూజలు !

ఇదిలా ఉండగా శనివారం ఉదయం సామ్ ఒక్కతే తిరుపతికి వెళ్లి విఐపి దర్శనం సమయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. ఎప్పుడూ చై, సామ్ కలిసే గుడికి వెళ్తుండేవారు. ఇక శ్రీవారి దర్శనం, పూజల అనంతరం ఆలయ ప్రాంగణంలో సామ్ నడుస్తుండగా ఆమెను స్థానిక జర్నలిస్టులు చుట్టుముట్టారు. అందులో ఒకరు ఆమె విడాకుల గురించి వస్తున్న పుకార్ల విషయమై స్పందించారు. సమంత వెంటనే “గుడికి వచ్చింది … బుద్ధుందా?” అంటూ జర్నలిస్ట్‌పై గరం అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. దానిపై క్లారిటీ ఇస్తే అందరూ సైలెంట్ అవుతారు కానీ జర్నలిస్ట్ పై కోప్పడితే ఒరిగేదేంటి ? అని సామ్ ను ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు.

Read Also : చిక్కుల్లో సోనూసూద్… కోట్లలో పన్ను ఎగవేత

ఇక సమంత దాంపత్య సమస్యల పరిష్కారమై తిరుమలలో వరుస పూజలు చేస్తున్నట్టు కూడా వార్తలు విన్పిస్తున్నాయి. ఏదేమైనా సామ్, చై వారిద్దరి విడాకుల రూమర్స్ గురించి అధికారికంగా ప్రకటించే వరకూ అక్కినేని అభిమానులకు ఆందోళన తగ్గదు. మిగతా వారిలోనూ ఆసక్తి తగ్గదు. అంతేకాదు వాళ్ళు ఏం చేస్తున్నా కూడా నెటిజన్లు భూతద్దంలో చూడడం మానరు. ఫలితంగా రూమర్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. మరి ఈ జంట వారిపై వస్తున్న రూమర్స్ పై ఎప్పుడు స్పందిస్తారో !?