NTV Telugu Site icon

Ram Charan : రామ్ చరణ్ ఖాతాలో మరో కొత్త బ్రాండ్ ..యాడ్ అదిరిపోయిందిగా..

Cherry

Cherry

టాలివుడ్ స్టార్ హీరో, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలలో నటిస్తున్నారు.. స్టార్ ఇమేజ్ ను అందుకోవడంతో పాటు మరోవైపు కమర్షియల్ యాడ్ చేస్తూ కూడా భారీగానే సంపాదిస్తున్నారు.. వరుస సినిమాలు, యాడ్స్ తో రామ్ చరణ్ బిజీగా ఉన్నాడు.. చరణ్ ఇప్పటికే ఎన్నో యాడ్స్ లలో నటించారు.. అందులో ప్రముఖ బ్రాండ్స్ కూడా ఉన్నాయి.. ఇప్పుడు మరో కొత్త యాడ్ లో నటించారు.. అందుకే సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..

తాజాగా సరికొత్త ఆడ్ ద్వారా రామ్ చరణ్ ప్రేక్షకుల ముందుకు వస్తూ తండ్రి పట్ల ఉన్నటువంటి ప్రేమను తెలియజేయడమే కాకుండా నాన్నను చూసి నేర్చుకున్నాను అంటూ ఈయన చెప్పినటువంటి డైలాగ్స్ యాడ్ చాలా బాగుంది.. ప్రముఖ బ్రాండెడ్ బట్టల సంస్థ మాన్యవర్ కోసం ఈ యాడ్ చేశారు.. ఇందులో భాగంగా రామ్ చరణ్ నాన్న అడుగులో అడుగు వేస్తూ చాలా నేర్చుకున్నాను. ఆయనను చూసి చేసే పనిలో పట్టుదలతో ఉండాలని, మనల్ని ప్రేమించే వారిని ఎక్కువగా మనకంటే ప్రేమించాలని తెలుసుకున్నాను. తన గురించి ఆలోచనని వారికోసం ఆలోచించడం నాన్నను చూసే నేర్చుకున్నాను, జీవితంలో నిలబడానికి నాన్నని చూసే నేర్చుకున్నాను అంటూ రామ్ చరణ్ ప్రతి ఒక్క నాన్న కొడుకుల కథని ఒక చిన్న యాడ్ లో చూపించేశాడు.. తండ్రి కొడుకుల బంధం తో పాటుగా యాడ్ కూడా బాగా వచ్చింది..

ఈ యాడ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..ఈ వీడియో చూసిన అభిమానులందరూ కూడా ఈ వీడియోలో నాన్న పాత్రలో చిరంజీవి చేసే ఉంటే బాగుండేది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు.. ఈ వీడియో చూసినటువంటి చరణ్ ఫాన్స్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక చరణ్ సినిమాల విషయానికొస్తే.. చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఇక ఈయన ప్రస్తుతం ఈ సినిమాకు కాస్త బ్రేక్ ఇచ్చారని తెలుస్తుంది.. మరోవైపు వరుణ్ తేజ్ పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నాడు..