Site icon NTV Telugu

ఆకట్టుకుంటున్న ‘పుష్ప’రాజ్ లవర్ శ్రీవల్లి లుక్

Pushpa Raj's heart melts at the sight of his love

‘పుష్ప’రాజ్ ఎప్పుడెప్పుడు వస్తాడా అని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. శేషాచలం కొండలలో ఎర్రచందనం స్మగ్లింగ్‌ ఆధారంగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’ రెండు భాగాలుగా రానుంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్ గా తెరకెక్కుతున్న పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప: ది రైజ్-పార్ట్ 1”. ఈ చిత్రంలో మలయాళ స్టార్ ఫహద్ ఫాసిల్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నారు. ముత్తంశెట్టి మీడియా సహకారంతో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి అప్డేట్ ను ప్రకటించారు మేకర్స్. తాజాగా రష్మిక మందన్న లుక్ ను విడుదల చేశారు. భయంకరమైన ‘పుష్ప’రాజ్ లవర్ శ్రీవల్లిని పరిచయం చేశారు.

Read Also : పోసాని కృష్ణ మురళిపై కేసు నమోదు

ఆ పోస్టర్ లో ఆమె రెడీ అవుతూ కన్పిస్తోంది. తాంబూలంలో పట్టు చీరతో పాటు పువ్వులు కూడా ఉన్నాయి. శ్రీవల్లి పెళ్ళికి రెడీ అవుతున్నట్టు అర్థమవుతోంది. అయితే అందులో ఆమె రెడీ అవుతున్న విధానం, ఎక్స్ ప్రెషన్ చూస్తుంటే తనకు ఇష్టం లేకుండానే సిద్ధమవుతున్నట్టు అన్పిస్తోంది. మరి ఈ ఊహాగానాలు నిజమేనా? లేదా కథ ఏదైనా మలుపు తీసుకుంటుందా ? అనేది చూడాలి. ఇటీవల ఇచ్చిన అప్డేట్ ప్రకారం త్వరలోనే సెకండ్ సింగిల్ రాబోతోంది. క్రిస్మస్ కానుకగా మొదటి భాగం “పుష్ప : ది రైజ్-పార్ట్ 1″ను విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు. కానీ అంతకన్నా ముందే సినిమా విడుదలయ్యే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది.

Exit mobile version