హైదరాబాద్ భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక. ఎక్కడెక్కడి నుంచో వచ్చి హైదరాబాద్‌లో సెటిల్ అవుతుంటారు. ఇక్కడ ఎన్నో చారిత్రాత్మక కట్టడాలు ఉన్నాయి. ప్రేమకు చిహ్నాలుగా కట్టిన కట్టడాలు ఉన్నాయి. అలాంటి కట్టడాల్లో ఒకటి పురానాపూల్ బ్రిడ్జి. ఈ వంతెన ప్రేమకు చిహ్నంగా నిర్మించారు. కులీకుతుబ్ షా, భాగమతి ప్రేమకు గుర్తుగా ఈ మూసీ నదిపై వంతెనను నిర్మించారు. గోల్కొండ కోటలో ఉండే కులీకుతబ్ షా, మూసీ నదికి ఇవతల ఉండే భాగమతి ప్రేమలో పడిన తరువాత మూసీని దాటేందుకు ఇబ్బందులు వస్తున్నాయని చెప్పి ఈ వంతెనను నిర్మించారు. 1578లో ఈ వంతెన నిర్మాణం జరిగింది.
Read: Mask: ఈ కార్టూన్‌ను చూస్తే… మాస్క్‌ను అస్సులు తీయరు…
హైదరాబాద్‌లో నిర్మించిన తొలి వంతెన కూడా ఇదే. అయితే, ఈ వంతెనకు ప్యారానాపూల్ అని నామకరణం చేశారు. కాలక్రమేనా అది పురానాపూల్‌గా మారింది. మూసీపై నిర్మించిన ఈ వంతెన ఎన్నో ఆటుపోటులను ఎదుర్కొన్నది. చరిత్రకు సాక్ష్యంగా నిలిచింది. అయితే, ఈ వంతెనపై ప్రస్తుతం కాయగూరల మార్కెట్ వెలిసింది. చరిత్రకు సాక్ష్యంగా ఉన్న వంతెనను ప్రభుత్వం పట్టించుకొని పర్యాటక పరంగా అభివృద్ది చేయాలని స్థానికులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
