Site icon NTV Telugu

“ప్రభాస్ 25” అనౌన్స్ మెంట్ ఎప్పుడంటే ?

Prabhas 25 Announcement on October 7th

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస హై ఆక్టేన్ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆ సినిమాలన్నీ త్వరగా పూర్తి చేసి వీలైనంత తొందరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారు. ప్రభాస్ ఇప్పుడు వరుసగా రాధే శ్యామ్, సలార్, ఆది పురుష్, ప్రాజెక్ట్ కేతో చాలా బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో ప్రభాస్ 25 సినిమా గురించి వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభాస్ త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అప్డేట్ తో ప్రేక్షకులను సర్ప్రైజ్ చేయడానికి సిద్ధమయ్యారు. ఈ మేరకు ముహూర్తం కూడా ఖరారైంది.

Read Also : ట్రైలర్ : కామెడీతో ఆకట్టుకుంటున్న “ఆరడుగుల బుల్లెట్”

ప్రభాస్ తన 25వ సినిమాను అక్టోబర్ 7న నవరాత్రి ఉత్సవాల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రకటించనున్నారు. కానీ అప్పటి వరకూ చిత్ర బృందం ఈ వివరాలను గోప్యంగా ఉంచుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ మునుపెన్నడూ చూడని పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే పలు బ్లాక్‌బస్టర్‌లను అందుకున్న, కల్ట్ స్టేటస్ ఉన్న దర్శకుడు ఈ ప్రాజెక్ట్ కు దర్శకత్వం వహించనున్నాడని సమాచారం. బాలీవుడ్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్‌ దర్శకత్వం వహిస్తారని, దిల్ రాజు ఈ ప్రాజెక్ట్ ను నిర్మిస్తారని వార్తలు వచ్చాయి.

ప్రభాస్ తదుపరి చిత్రం ‘రాధే శ్యామ్’ జనవరి 12, 2022 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు ప్రభాస్, ఓం రౌత్ ‘ఆదిపురుష్’, ప్రశాంత్ నీల్ ‘సలార్’ అనే రెండు సినిమాల షూటింగ్‌లలో ఉన్నాడు. ఆయన 2022లో దర్శకుడు నాగ్ అశ్విన్ ‘ప్రాజెక్ట్ కే’ షూటింగ్ ను ప్రారంభిస్తాడు. ప్రభాస్ 25వ చిత్రం 2023లో ప్రారంభమవుతుంది.

Exit mobile version