NTV Telugu Site icon

Imsha Rehman: సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ప్రైవేట్ వీడియోలు లీక్.. ఖాతాలన్నీ డీయాక్టివేట్

Imsha Rehman

Imsha Rehman

వ్యక్తుల ప్రైవేట్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. అదేవిధంగా.. ఇటీవల పాకిస్థానీ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, టిక్‌టాకర్ ఇమ్షా రెహ్మాన్ యొక్క ప్రైవేట్ వీడియోలు (MMS) వైరల్ అయ్యాయి. ఆ తర్వాత ఆమె ఓ పెద్ద నిర్ణయం తీసుకుంది. తన సోషల్ మీడియా ఖాతాలను డీయాక్టివేట్ చేసింది. ఇమ్షా ఒక ప్రైవేట్ వీడియోలో ఒక అబ్బాయితో అభ్యంతరకరమైన స్థితిలో కనిపించింది. ఈ వీడియోలు సోషల్ మీడియా సైట్‌లలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

READ MORE: href=”https://ntvtelugu.com/news/full-list-of-records-broken-against-south-africa-in-4th-t-20-711405.html”>IND vs SA: విదేశీ గడ్డపై అతిపెద్ద స్కోరు.. అరడజను రికార్డులను బద్దలుకొట్టిన తిలక్ వర్మ, సంజూ శాంసన్

ఇమ్షా రెహమాన్ ఎవరు?
ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్ పాకిస్తాన్‌లో చాలా ప్రసిద్ధి చెందాయి. రెండు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో కూడా ఇమ్షా చురుగ్గా పాల్గొంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో జీవనశైలి, ఫ్యాషన్ కంటెంట్‌ని సృష్టించడం ద్వారా ఆమె తన కెరీర్‌ను ప్రారంభించింది. క్రమంగా ఆమె అనుచరులు పెరుగుతూనే ఉన్నారు. కొంతకాలం తర్వాత ఆమె పాకిస్థాన్‌ సోషల్ మీడియాలో సెలబ్రెటీగా మారింది. ఇమ్షా టిక్‌టాక్‌లో ఎంత ఫేమస్ అయ్యిందో ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా అంతే ఫేమస్. ఆమె ఎదైన ఒక అంశానికి సంబంధించిన వీడియో కంటెంట్‌ను పోస్ట్ చేస్తే.. దానికి వేల సంఖ్యలో లైక్‌లు, వీక్షణలు వస్తాయి. 2024లో, ఇమ్షా తన టిక్‌టాక్ వీడియోలపై 12.1 మిలియన్లకు పైగా లైక్‌లను సంపాదించింది. దీన్నిబట్టి పాకిస్థాన్‌లో ఆమె సోషల్ మీడియాలో ఎంత పాపులర్ అయిందో అర్థమవుతోంది.

READ MORE:IPL 2025 Auction: ఐపీఎల్ 2025 మెగా వేలం కోసం ఆటగాళ్ల జాబితా విడుదల.. 13 ఏళ్ల వయస్సులోనే..

ఒక్కో బ్రాండ్ ప్రమోషన్ కోసం ఆమె లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. నివేదికల ప్రకారం.. ఇమ్షా నికర విలువ ఐదు లక్షల అమెరికన్ డాలర్లు. ఇది ఆమె సోషల్ మీడియా ద్వారా చాలా సంపాదించిందని చూపిస్తుంది. ఇటీవల, చాలా మంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల ప్రైవేట్ వీడియోలు పాకిస్థాన్‌లో వైరల్ అయ్యాయి. కొంతకాలం క్రితం, మినాహిల్ మాలిక్ అభ్యంతరకరమైన వీడియో కూడా వైరల్ అయ్యింది. ఆ వీడియోలో కూడా ఆమె ఓ అబ్బాయితో అభ్యంతరకర స్థితిలో కనిపించింది. అయితే ఆ వీడియోను ఫేక్ అని, ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని ఆమె తెలిపింది.

Show comments