NTV Telugu Site icon

Jr. Ntr: బాల రాముడి నుంచి కొమరం భీం దాకా .. ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్..

Ntr Birthday

Ntr Birthday

టాలీవుడ్ యంగ్ హీరో, గ్లోబల్ స్టార్ హీరో ఎన్టీఆర్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఎన్టీఆర్ నేడు తన 41వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. యాక్టింగ్, యాక్షన్, డ్యాన్స్ ఇలా అన్ని విషయాల్లోనూ తనదైన ముద్ర వేసి గ్లోబల్ స్టార్ గా అభిమానుల మనసును దోచుకున్నాడు.. ఎందరో అభిమానులు ఎన్టీఆర్ సినిమాల కోసం వెయిట్ చేస్తున్నారు..ఆయన బర్త్ డే స్పెషల్ గా ఎన్టీఆర్ సినిమాలను ఒకసారి గుర్తు చేసుకుందాం..

నందమూరి తారకరామారావు వారసుడుగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చాడు.. తక్కువకాలంలోనే తనదైన గుర్తింపు సాధించారు. 1991లో బ్రహ్మర్షి విశ్వామిత్రతో బాలనటుడిగా తెరంగేట్రం చేశారు ఎన్టీఆర్. రామాయణంలో మెప్పించారు. 2001లో ‘నిన్ను చూడాలని’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు.. అప్పటినుంచి ఎన్నో సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు.. రీసెంట్ గా వచ్చిన త్రిపుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు.. ఎన్టీఆర్ ఇప్పటి వరకు 29 సినిమాల్లో నటించారు. 30వ మూవీగా ప్రస్తుతం దేవర చిత్రం చేస్తున్నారు..

దేవర సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.. త్వరలోనే ఈ సినిమా విడుదల కాబోతుంది.. నిన్న ఎన్టీఆర్ బర్త్ డే సందర్బంగా విడుదల సాంగ్ ప్రస్తుతం నెట్టింట ట్రెండ్ అవుతుంది.. ఇక వార్ 2 చిత్రంతో బాలీవుడ్‍లోనూ ఎన్టీఆర్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రంలో హృతిక్ రోషన్‍‍తో కలిసి మెయిన్ రోల్ లో నటిస్తున్నాడు.. ఈ సినిమా నుంచి కూడా ఈరోజు అప్డేట్ రావచ్చునని టాక్.. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ కాంబోలో ఓ సినిమా చేస్తున్నాడు.. ప్రస్తుతం ఆ సినిమా ప్రీ ప్రోడక్షన్ పనుల్లో బిజీగా ఉంది..

Show comments