భారతదేశంలోని అన్ని ప్రాంతాల్లోకి భారతీయులకు అనుమతి ఉంటుంది. అయితే, కొన్ని చోట్లకు మాత్రం భారతీయులను అనుమతించరు. ఆయా ప్రాంతాల్లో కేవలం విదేశీయులను మాత్రమే అనుమతిస్తారట. బెంగళూరులోని శాంతినగర్ ప్రాంతంలో యూనో ఇన్ అనే హోటల్ ఉన్నది. ఈ హోటల్ లోకి కేవలం జపనీయులకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. మిగతా వారిని ఈ హోటల్‌లోకి అనుమతించరు.
Read: గుడ్డివాడి పాత్రలో ‘ఐకాన్’ స్టార్!
అదే విధంగా హిమాచల్ ప్రదేశ్‌లోని కాసోల్ ప్రాంతంలో ఫ్రీకాసోల్ కేఫ్ ఉన్నది. ఈ కేఫ్‌లోకి 2015 నుంచి భారతీయులను అనుమతించడం లేదు. కేవలం ఇజ్రాయిల్ దేశస్థులకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. అటు తమిళనాడులోనూ ఇలాంటి హోటల్ ఒకటి ఉన్నది. రాజధాని చెన్నైలో బ్రాడ్‌ల్యాండ్ లాడ్జీలోకి భారతీయులకు నో పర్మీషన్. విదేశీ వీసా ఉంటేనే అనుమతిస్తారు. నో ఇండియన్ పాలసీని ఆ లాడ్జీలో ఖచ్చితంగా అమలు చేస్తారట.
