Site icon NTV Telugu

నాసా స‌రికొత్త ప్ర‌క‌ట‌న‌: అంగార‌కుడిపై నివాసం ఉంటారా…!!

భూమిపై జీవ‌రాశి ఏదైన ప్ర‌మాదం సంభ‌వించి నివ‌శించ‌డానికి అనుకూలంగా లేక‌పోతే… ప‌రిస్థితి ఏంటి? మ‌నుగ‌డ సాగించ‌డం ఎలా..? ఈ విష‌యాల‌ను దృష్టిలో పెట్టుకొని మార్స్ గ్ర‌హంపై నాసా ప‌రిశోధ‌న‌లు చేస్తున్న‌ది.  ఎప్ప‌టికైనా మార్స్ మీద‌కు మ‌నుషుల‌ను పంపి అక్క‌డ కాల‌నీలు ఏర్పాటు చేసి నాగ‌రిక‌త‌ను విస్త‌రింప‌జేయాల‌ని చూస్తున్న‌ది.  ఇందులో భాగంగా భూమిపై మార్స్ గ్ర‌హంలో ఉండే విధ‌మైన కృత్రిమ వాతావ‌ర‌ణాన్ని నాసా సృష్టించింది.  అక్క‌డ సంవ‌త్స‌రంపాటు మ‌నుషుల‌ను ఉంచి మార్స్ మీద‌కు వెళ్లిన‌పుడు మ‌నుషులు ఎలా ఉంటారు అనే విష‌యాల‌ను తెలుసుకోబోతున్న‌ది.  

Read: క‌రోనా ఎఫెక్ట్‌: దుర్గాదేవికి మాస్క్‌… చేతిలో శానిటైజ‌ర్‌…

కృత్రిమ వాతావ‌ర‌ణంలో నివ‌శించేందుకుగాను ఔత్సాహికుల నుంచి ధ‌ర‌ఖాస్తులను ఆహ్వానిస్తోంది.  హ్యూస్ట‌న్‌లోని జాన్సన్ అంత‌రిక్ష కేంద్రంలోని ఓ ప్ర‌దేశంలో మార్స్ డ్యూన్ ఆల్ఫా అనే ప్ర‌త్యేక‌మైన ఆవాసం ఏర్పాటు చేసింది.  1700 చ‌ద‌ర‌పు విస్తీర్ణంలో ఈ కృత్రిమ మార్స్ వాతావ‌రణాన్ని ఏర్పాటు చేసింది.  ఈ వాతావ‌ర‌ణంలోకి ప్ర‌వేశించిన త‌రువాత వారి శ‌రీరంలో వ‌చ్చే మార్పుల‌ను, స‌మ‌స్య‌ల‌ను ముందుగానే తెలుసుకోవాల‌ని నాసా నిర్ణ‌యం తీసుకుంది.  ఈ అవ‌కాశం కేవ‌లం అమెరికాలో శాశ్వ‌త నివాసం ఉంటున్న వారికి మాత్ర‌మే అని నాసా పేర్కొన్న‌ది.  

Exit mobile version