వర్జిన్ గెలాక్టిక్ వ్యోమనౌన ఇటీవలే విజయవంతంగా రోదసిలోకి వెళ్లివచ్చింది. కమర్షియల్‌గా రోదసి యాత్రను ప్రారంభించేందుకు వర్జిన్ గెలక్టిక్ సన్నాహాలు చేస్తున్నది. భూమి నుంచి సుమారు 88 కిలోమీటర్ల వరకు రోదసిలో ప్రయాణం చేసి అక్కడ భారరహిత స్థితిని పొందిన అనుభూతిని పొందిన తరువాత తిరిగి భూమిమీదకు వస్తుంది. వర్జిన్ గెలక్టిక్ అంతరిక్షయాత్ర విజయవంతం కావడంతో, ఇప్పుడు అనేక మంది ఈ యాత్రను చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇండియాలోని కేరళకు చెందిన పర్యాటకుడు సంతోష్ జార్జ్ కులంగర వర్జిన్ గెలాక్టిక్ యాత్ర చేసేందుకు సిద్ధం అవుతున్నారు. దీనికోసం మొత్తం 2.5 లక్షల డాలర్లు చెల్లించేందుకు సిద్ధం అవుతున్నారు. దీంతో ఆయన భారత్ నుంచి తొలి భారతీయ అంతరిక్ష పర్యాటకుడిగా గుర్తింపు పొందబోతున్నారు. ఈ ప్రయాణంలో తనతో పాటుగా తన కెమేరాను తీసుకెళ్లి పర్యటనకు సంబందించిన వివరాలను తన సంచారం ద్వారా తెలియజేస్తానని అంటున్నాడు సంతోష్. సంచారం పేరుతో ఆయన ఇప్పటి వరకు 1800 ఎపిసోడ్లను ప్రసారం చేశాడు. 130 కి పైగా దేశాల్లో పర్యటించాడు.
ఇండియా నుంచి ఆయనకే తొలి అవకాశం…
