అఫిషియల్ : రామ్ కు విలన్ గా కోలీవుడ్ స్టార్

ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా ప్రముఖ తమిళ దర్శకుడు లింగుసామి దర్శకత్వంలో ఓ ద్విభాషా చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ చేసేశారు. పూర్తిస్థాయి మాస్ మసాలా ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రాన్ని “రాపో19” అనే వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్నారు. రామ్ కెరీర్‌లో అత్యంత ఖరీదైన ప్రాజెక్టులలో “రాపో19” ఒకటి. ఇది ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో చిత్రీకరించబడుతుంది. అంతేకాదు ఈ చిత్రం రామ్ మొదటి ద్విభాషా చిత్రం కూడా. ఈ మూవీతోనే రామ్ కోలీవుడ్ ఎంట్రీ చేయబోతున్నాడు. తాజాగా ఈ సినిమాలో విలన్ రోల్ కు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

Read Also : అఫిషియల్ : రామ్ కు విలన్ గా కోలీవుడ్ స్టార్

గతకొంతకాలంగా ఈ సినిమాలో ఆది పినిశెట్టి విలన్ గా నటించబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలను నిజం చేస్తూ నేడు కోలీవుడ్ స్టార్ ఆది పినిశెట్టిని తమ టీంలోకి ఆహ్వానిస్తూ అధికారిక ప్రకటన చేసింది చిత్రబృందం. ఇందులో విలన్ రోల్ కోసం లింగుసామి పవర్ స్టోరీని సిద్ధం చేసుకున్నాడట. వీరిద్దరి మధ్య ఘర్షణ దృశ్యాలు ఈ చిత్రానికి ప్రధాన హైలైట్‌గా నిలుస్తాయి అంటున్నారు. రామ్, ఆది మొదటి సారి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-