Site icon NTV Telugu

IPL 2022: పంజాబ్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్

Ipl1

Ipl1

పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ రెండు జట్లూ ఇవాళ ఢీకొడుతున్నాయి. ఐపీఎల్ 2022లో భాగంగా జరుగుతున్న 32వ మ్యాచ్‌లో ఈ రెండు జట్లు తలపడుతున్నాయి. ముంబైలోని బ్రబోర్న్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఢిల్లీ కెప్టెన్ రిషభ్ పంత్ టాస్ గెలిచాడు. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన మిచెల్ మార్ష్ స్థానంలో సర్ఫరాజ్ ఖాన్‌ను తీసుకున్నట్లు పంత్ తెలిపాడు. పంజాబ్ జట్టులో రెండు మార్పులు జరిగాయి. మయాంక్ తిరిగి రావడంతో ప్రభ్‌సిమ్రాన్ సింగ్‌ బెంచ్‌కే పరిమితం అయ్యాడు. ఒడియన్ స్మిత్ స్థానంలో నాథన్ ఎలిస్‌కు అవకాశం ఇచ్చారు.

పంజాబ్ కింగ్స్: మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), శిఖర్ ధావన్, జానీ బెయిర్‌స్టో, లియామ్ లివింగ్‌స్టన్, జితేష్ శర్మ, షారుఖ్ ఖాన్, కగిసో రబాడ, రాహుల్ చాహర్, వైభవ్ అరోరా, అర్షదీప్ సింగ్, నాథన్ ఎలిస్

ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, రిషభ్ పంత్ (కెప్టెన్), రోవ్‌మెన్ పావెల్, సర్ఫరాజ్ ఖాన్, లలిత్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, ఖలీల్ అహ్మద్ బరిలో వున్నారు.

ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్‌కు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. లలిత్ యాదవ్ వేసిన నాలుగో ఓవర్లో ఫామ్‌లో ఉన్న ఓపెనర్ శిఖర్ ధవన్ (9) ఔటయ్యాడు. లలిత్ వేసిన లెంగ్త్ బాల్‌ను వెనుక వైపునకు కొట్టేందుకు ధవన్ ప్రయత్నించాడు. ఈ క్రమంలో కీపర్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ మంచి ఆటతీరుతో ముందుకు వెళుతున్నాడు. 33 పరుగుల వద్ద పంజాబ్ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. అనంతరం కాసేపటికే పంజాబ్ కింగ్స్ రెండో వికెట్ కోల్పోయింది. ముస్తాఫిజ‌ర్ రెహమాన్ బౌలింగ్‌లో మ‌యాంక్ అగ‌ర్వాల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 5 ఓవ‌ర్లకు స్కోర్ 44/2.

Exit mobile version