Site icon NTV Telugu

Indian Currency : కరెన్సీ నోట్లపై ఇవి ఎందుకో మీకు తెలుసా..?

Currency

Currency

మనం రోజు వాడే ఇండియన్ కరెన్సీ నోట్లలో ఎన్నో నిజాలు దాగి ఉన్నాయి. అయితే మనం ఇప్పుడు ఇండియన్‌ కరెన్సీ గురించి కొన్ని నిజాలను తెలుసుకుందాం. మనం అందరం ఇండియన్‌ కరెన్సీని రోజు వినియోగిస్తుంటాం. అయితే.. కరెన్సీ నోట్లపై సింబల్స్‌ ఉంటాయి. అయితే అవి ఎందుకు ఉన్నాయని మీకు తెలుసా..? కళ్ళులేనివారు ఈ సింబల్స్‌ను బట్టి కరెన్సీ విలువ ఎంతని ఈజీగా గుర్తించడానికి ఈ సింబల్స్‌ను ప్రింట్‌ చేస్తుంటారు. అంధులు ఈ సింబల్స్‌పై వేలును పెట్టి ఆ నోటు విలువను గుర్తిస్తారు. చాలా మంది నమ్మే విషయం ఏమిటంటే మన దేశంలో కరెన్సీ నోట్లు అన్ని పేపర్‌తోనే తయారు చేస్తున్నారని అనుకుంటారు.

 

కానీ మన దేశంలో ఉన్న కరెన్సీ నోట్లన్నీ కాటన్‌, కాటన్‌ ట్రాక్‌తోనే తయారు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇటీవలే పది రూపాయల కాయిన్స్‌ తయారు చేయడాన్ని నిలిపివేశారు. ఎందుకంటే ఒక కాయిన్‌ తయారు చేయడానికి ఆరు రూపాయలు ఖర్చు అవుతుందట. అంతేకాకుండా మన దేశంలో ఉన్న కాయిన్స్‌ను బాగా గమనిస్తే.. కాయిన్‌ సంవత్సరంలో తయారు చేశారని ఆ సంవత్సరాన్ని కాయిన్ పై ముద్రిస్తారు. దానికి కింద కొన్ని సింబల్స్‌ ఉంటాయి. ఆ సింబల్స్‌ ఏ రాష్ట్రంలో ఆ కాయిన్‌ తయారు చేశారో తెలుపుతుంది.

 

Exit mobile version