IND vs PAK: భారత్-పాక్ మ్యాచ్‌లో ఆటగాళ్ల మధ్య గొడవ.. వీడియో వైరల్.. ఇంతకీ ఏం జరిగిందంటే?
- భారత్-పాకిస్థాన్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్
- భారత్-పాకిస్థాన్ ఆటగాళ్ల మధ్య గొడవ
- వైరల్ వీడియో వెనుక అసలు నిజం ఇదే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India And Pakistan Players Fight Video: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఆదివారం భారత్-పాకిస్థాన్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో దాయాది పాకిస్థాన్‌పై 64 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ అనంతరం సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో పాకిస్థాన్ మహిళా క్రికెటర్, ఓ భారత బ్యాటర్ మైదానంలోనే పరస్పరం దాడి చేసుకున్నట్లుగా.. అంపైర్లు, ఇతర ఆటగాళ్లు మధ్యలోకి వచ్చి వారిని విడదీస్తున్న దృశ్యాలు ఉన్నాయి. ఈ వీడియోను చూసిన అభిమానులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. నిజంగానే మ్యాచ్‌లో ఇలాంటి ఘటన జరిగిందా? అంటూ పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.
భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, పాక్ సారథి ఫాతిమా సనా షేక్ మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో మైదానంలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నట్లు ఆ వీడియోలో ఉంది. అయితే వైరల్ అవుతున్న ఈ వీడియో పూర్తిగా నకిలీదని తేలింది. మ్యాచ్ సందర్భంగా ఎలాంటి ఘటన చోటుచేసుకోలేదని స్పష్టమైంది. కృత్రిమ మేధస్సు (ఏఐ) సాయంతో ఈ వీడియోను కొందరు ఆకతాయిలు రూపొందించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఏఐ టెక్నాలజీతో రూపొందించిన వీడియోలు వైరల్ అవుతున్న నేపథ్యంలో.. ఈ వీడియో కూడా అదే తరహాలో సృష్టించబడిన ఫేక్ కంటెంట్‌గా గుర్తించారు. మ్యాచ్ రిపోర్టులు, అధికారిక ప్రసారాలు లేదా ఐసీసీ రికార్డుల్లో ఎక్కడా ఆటగాళ్ల మధ్య గొడవ జరిగినట్లు లేదు.
Also Read
- Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
- 243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
- Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
- 6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన గ్రూప్-ఏ పోరులో భారత మహిళల జట్టు పాకిస్థాన్‌పై 64 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. వైస్ కెప్టెన్ స్మృతి మంధాన అద్భుత హాఫ్ సెంచరీ (68)తో చేయగా.. రిచా ఘోష్ చివర్లో వేగంగా ఆడి 34 పరుగులతో జట్టుకు భారీ స్కోరు అందించింది. 171 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్‌కు భారత స్పిన్నర్లు చుక్కలు చూపించారు. ముఖ్యంగా స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ తన కెరీర్లోనే అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. నాలుగు ఓవర్లలో కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టి పాక్ బ్యాటింగ్‌ను కుదేలు చేసింది.
Things got tense in the middle as Harmanpreet Kaur and Fatima Sana Sheikh exchanged some heated words during the India vs Pakistan showdown. 😤🔥👀#INDvsPAK pic.twitter.com/62BZPjzkKr
— Faruk (@uf2151593) June 14, 2026
తాజావార్తలు
-
Mirzapur The Movie Box Office: జన్మాష్టమి రోజున ‘మీర్జాపూర్’ కి డబ్బుల వర్షం.. మొదటి రోజు ఎంత రాబట్టిందో తెలిస్తే..
-
KTR: ‘జాబులు లేవు.. జవాబులు లేవు’.. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర విమర్శలు
-
Pretorius Breaks T20 Record: వైభవ్ సూర్యవంశీ సహచరుడి చరిత్రాత్మక శతకం.. అరుదైన రికార్డు సొంతం
-
Nayanthara: స్టార్ హీరోయిన్లో సడెన్ ఛేంజ్.. ఫస్ట్ టైమ్ ఇలా!
-
Teachers Day Special: ద్రోణాచార్యుడి నుంచి వశిష్ఠుడి వరకు.. దేవతలు సైతం తలవంచిన 10 మంది మహా గురువులు వీరే!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!