Site icon NTV Telugu

వ్యాక్సినేష‌న్‌లో ఇండియా మ‌రో రికార్డ్‌…

ఇండియాలో వ్యాక్సినేష‌న్‌ను వేగంగా అమ‌లు చేస్తున్నారు.  జూన్ 21  వ తేదీ నుంచి దేశంలో 18 ఏళ్లు నిండిన వారికి ఉచిత వ్యాక్సిన్‌ను అందిస్తున్నారు.  రోజుకు ల‌క్ష‌ల సంఖ్య‌లో వ్యాక్సిన్‌ను అందిస్తున్న సంగ‌తి తెలిసిందే.  ఈ ఏడాది జ‌న‌వ‌రి 16 నుంచి వ్యాక్సినేష‌న్‌ను ప్రారంభించారు.  మొద‌ట్లో మంద‌కోడిగా సాగిన వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కొన్ని రోజులుగా వేగంగా అమ‌లు చేస్తున్నారు.

Read: ఎన్టీఆర్ ఫిల్మ్స్ బ్యానర్ లో పి. వి. నరసింహరావు బయోపిక్!

 అయితే, వ్యాక్సినేష‌న్ విష‌యంలో ఇండియా మ‌రో కొత్త రికార్డ్ ను సాధించింది.  ప్ర‌పంచంలో అత్య‌ధిక మందికి వ్యాక్సిన్ అందించిన దేశంగా ఇండియా అవ‌త‌రించింది.  ఇండియాలో ఇప్ప‌టి వ‌ర‌కు 32,36,63,297 మందికి వ్యాక్సిన్‌ను అందించారు.  అమెరికాలో 32,33,27,328 మందికి వ్యాక్సిన్ అందించారు. ఇండియా, అమెరికా త‌రువాత ఇంగ్లాండ్‌,  జ‌ర్మ‌నీ, ఫ్రాన్స్‌, ఇట‌లీ దేశాలు ఉన్నాయి.  

Exit mobile version