NTV Telugu Site icon

Kerala: వేగంగా వస్తున్న రైలు.. ట్రాక్‌ మధ్యలో పడుకున్న వ్యక్తి.. చివరికీ.. (వీడియో)

కేరళలోని కన్నూర్ జిల్లాలో ఓ షాకింగ్ ఘటన బయటకు వచ్చింది. వేగంగా వస్తున్న రైలు నుంచి తనను తాను రక్షించుకోవడానికి ఓ వ్యక్తి పట్టాల మధ్యలో పడుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో ఓ వ్యక్తి కన్నూర్ సమీపంలోని ట్రాక్‌ మధ్యలో పడుకోవడం.. రైలు అతనిపై నుంచి వెళ్ళడం చూడవచ్చు. ఈ ఘటన సోమవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో కన్నూర్- చిరక్కల్ రైల్వే స్టేషన్ల మధ్య జరిగింది.

READ MORE: Bandi Sanjay: ఆ విషయంలో కాంగ్రెస్ పార్టీకి ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చు..

రైల్వే పోలీసులు ఆ వ్యక్తిని పవిత్రన్‌గా గుర్తించారు. ఆయన వయసు 56 ఏళ్లు. పవిత్రన్ వాంగ్మూలాన్ని నమోదు చేసినట్లు రైల్వే పోలీసు అధికారి తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళూరు-తిరువనంతపురం రైలు వేగంగా వస్తోంది. పవిత్రన్ ఫోన్‌లో మాట్లాడుతూ.. ట్రాక్ నడుచుకుంటూ వెళ్తున్నాడు. రైలు రాకను గమనించలేక పోయాడు. రైలు దగ్గరకు రాగానే చూసి భయాందోళనకు గురయ్యాడు. పారిపోయే సమయం లేదు. దీంతో ట్రాక్‌ మధ్యలో పడుకున్నాడు. రైలు వెళ్లియాక సాఫీగా లేచి వెళ్లిపోయాడు.

READ MORE: CM Revanth Reddy: అప్పుడు పీసీసీగా.. ఇప్పుడు సీఎంగా.. మెదక్‌ చర్చిలో రేవంత్ రెడ్డి..

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు గుర్తించారు. ఓ అధికారి మాట్లాడుతూ.. “వీడియో చూసిన తర్వాత మేము కూడా ఆశ్చర్యపోయాం. వ్యక్తి ఆకారం చిన్నగా ఉంది కాబట్టి సురక్షితంగా బయటపడ్డాడు. ఈ వీడియోను చూసిన చాలా మంది ట్రాక్‌పై ఓ తాగుబోతు పడి ఉన్నాడని పుకార్లు వ్యాపించాయి. కానీ.. నేను తాగలేదని పవిత్రన్ స్పష్టం చేశాడు. తాను ప్రాణాన్ని కాపాడుకోవడానికి ట్రాక్‌ మధ్యలో పడుకున్నట్లు తెలిపాడు.” అని తెలిపారు.

Show comments