NTV Telugu Site icon

Fact Check: అలర్ట్.. ఒకటి కంటే ఎక్కువ బ్యాంకుల్లో అకౌంట్లు ఉంటే భారీ జరిమానా?.. వార్తలో నిజమెంత?

Fact Check

Fact Check

ప్రస్తుతం ఒక చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఒక కథనంలోని కొన్ని పాయింట్స్ తీసుకుని రాశారు. ఈ కథన ప్రకారం.. “ఇప్పుడు మీరు ఒకటి కంటే ఎక్కువ బ్యాంకుల్లో ఖాతా తెరవలేరు. ఇలా చేస్తే జరిమానా విధిస్తారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) సూచనల మేరకు ఇది జరుగుతోంది.” అని పేర్కొన్నారు. ఈ వైరల్ కథనాన్ని చదివిన ప్రజలు షాక్, కలత చెందుతున్నారు. అడిగే ప్రశ్న ఇది నిజంగా జరుగుతుందా? ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలు కలిగి ఉన్నందుకు ఆర్‌బీఐ జరిమానా విధిస్తుందా? అనే ప్రశ్నలు సమాధానాలను వెతికే ప్రయత్నం చేద్దాం…

READ MORE: Telangana Thalli Statue: నేడు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ..

ఈ వార్తని పరిశీలిస్తే.. వైరల్ అవుతున్న ఫోటోలో ఆర్‌బీఐ గవర్నర్ శశికాంత్ దాస్ ఫోటో ఉంది. ఆర్బీఐ లోగో కూడా ఉంది. “రెండు బ్యాంకుల్లో ఖాతాలు ఉంచితే కఠిన జరిమానా విధిస్తాం- ఐబీఐ గవర్నర్ శశికాంత్ దాస్” అని హిందీలో రాసి ఉంది. కానీ.. ఇలాంటి వార్తలను ఆర్‌బీఐ అధికారికంగా ధృవీకరించలేదు. బ్యాంకులో ఖాతా నంబర్‌కు సంబంధించి ఆర్‌బీఐ కొత్త మార్గదర్శకాలు ఏవీ జారీ చేయలేదు. రెండు బ్యాంకుల్లో ఖాతాలుంటే పెనాల్టీ ఉంటుందని చెప్పడం పూర్తిగా ఫేక్. కాబట్టి ఇలాంటి ఫేక్ న్యూస్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇలాంటి ఫేక్ న్యూస్ పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.

READ MORE:Nandyala: నంద్యాలలో దారుణం.. ప్రియురాలిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన యువకుడు