NTV Telugu Site icon

శాస్త్ర‌వేత్త‌ల ఆందోళ‌న‌: రెండు వేల ఏళ్ల‌లో ఏర్ప‌డిన మంచు 25 సంవ‌త్స‌రాల్లోనే…

ప్ర‌పంచంలో అత్యంత ఎత్తైన శిఖ‌రం మౌంట్ ఎవ‌రెస్ట్. దీనిని ప్ర‌తి ఏడాది ప‌దుల సంఖ్య‌లో ప‌ర్వతారోహ‌కులు అధిరోహిస్తుంటారు. చాలా మంది ఈ మంచుప‌ర్వ‌తం సానువుల‌ను సంద‌ర్శిస్తుంటారు. అయితే, ఇప్పుడు ఈ మంచుశిఖ‌రంపై శాస్త్ర‌వేత్త‌లు ఆందోళ‌న చెందుతున్నారు. 2వేల సంవ‌త్సరాలలో ఏర్ప‌డిన మంచు కేవ‌లం 25 ఏళ్ల‌లో క‌రిగిపోయింది. మంచు ఏర్ప‌డ‌టానికి ప‌ట్టిన స‌మ‌యం క‌న్నా 80 రెట్లు వేగంగా మంచు క‌రిగిపోతున్న‌ద‌ని శాస్త్ర‌వేత్త‌లు ఆందోళ‌న చెందుతున్నారు. దీనికి సంబందించిన విష‌యాల‌ను నేచ‌ర్ క్లైమేట్ జ‌ర్న‌ల్ లో పేర్కొన్నారు.

Read: భ‌ర్త‌ను అమ్మ‌కానికి పెట్టిన భార్య‌: షాకైన నెటిజ‌న్లు…

మౌంట్ ఎవ‌రెస్ట్ పై ఉన్న సౌట్ క‌ల్న‌ల్ గ్లేసియ‌ర్ లోని మంచు వేగంగా క‌రిగిపోతున్న‌ద‌ని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. మౌంట్ ఎవ‌రెస్ట్ ప్రాంతంలోని టూరిస్ట్ ప్రాంతాల్లో 12 వేల కిలోల మాన‌వ వ్య‌ర్ధాలు ఉన్నాయ‌ని, ఈ వ్య‌ర్ధాల కార‌ణంగా ఏర్ప‌డిన వేడి, వాతావ‌రణంలో వ‌స్తున్న మార్పుల వ‌ల‌న మంచు వేగంగా క‌రిగిపోతున్న‌ద‌ని, ఫ‌లితంగా రాబోయే రోజుల్లో ఈ ప్రాంతాల్లో నీటి ఎద్ద‌డి ఏర్ప‌డే అవ‌కాశం ఉంటుంద‌ని శాస్త్ర‌వేత్త‌లు అంచ‌నా వేస్తున్నారు.