జబర్దస్త్ నటుడు హైపర్ ఆది గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఎంతవారినైనా కూడా అస్సలు భయం లేకుండా తాను అడగాలనుకున్న మాటను అడిగేస్తాడు.. బుల్లితెరపై జరుగుతున్న ప్రతి ప్రోగ్రాం కు సంబందించిన ప్రతి ప్రోగ్రాం లో ఆది కనిపిస్తూ అలరిస్తాడు.. తాజాగా వినాయక చవితి స్పెషల్ ప్రోగ్రాంలో రెచ్చిపోయాడు.. సీనియర్ నటుడు నరేష్ పై దారుణమైన పంచులు వేసాడు అందుకు సంబందించిన ప్రోమో వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
ఆ ప్రోమో వీడియోలో నటుడు నరేశ్, పవిత్రా లోకేష్ స్పెషల్ గెస్ట్ లుగా హాజరయ్యారు. ఈ ప్రోగ్రాంకు యాంకర్ శ్రీముఖి వ్యాఖ్యాతగా వ్యవహరించింది. హైపర్ ఆది, తదితర కమెడియన్స్ పాల్గొని షోలో నవ్వులు పూయించే ప్రయత్నం చేశారు..ప్రోమోలో హైపర్ ఆది నరేశ్ పెళ్లిళ్ల పై షాకింగ్ కామెంట్స్ చేశారు. పవిత్రా పక్కనే ఉన్నప్పటికీ ‘నాకు ఒక్క పెళ్లే అవ్వట్లేదు.. మీకు పెళ్లి, మళ్లీ పెళ్లి? ఎలా సార్’ అని ఈవెంట్ వేదికగా నరేశ్ ను ప్రశ్నించారు. ఆది కామెంట్స్ కు నరేశ్, పవిత్రా మాత్రం ప్రోమోలో నవ్వుతూ కనిపించారు. అది కొంత కామెడీగా ఉన్నా అలా అనడంతో నరేష్ షాక్ అయ్యినట్లు వీడియోలో కనిపిస్తుంది..ఇంతకీ ఎలాంటి సమాధానం ఇచ్చారనేది ఆసక్తికరంగా మారింది..
మొన్నటివరకు నరేష్, పవిత్రల మ్యాటర్ రచ్చ రచ్చ అయిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు ఆది కామెంట్స్ తో అది మళ్లీ వైరల్ అవుతుంది.. ఇకపోతే హీరోగా పలు చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇక చివరిగా నరేష్ – పవిత్రా జంటగా ‘మళ్లీ పెళ్లి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.. ఇప్పుడు పలు సినిమాల్లో నటిస్తున్నట్లు తెలుస్తుంది..