Site icon NTV Telugu

Google Play Store : ఈ యాప్స్‌ మీ ఫోన్‌లో ఉంటే వెంటనే డిలీట్‌ చేయండి..

Google Play Store

Google Play Store

Google Play Store Removed 8 apps

రోజు రోజుకు టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో నేరలు సైతం పెరుగుతున్నాయి. అయితే ప్రస్తుత రోజుల్లో అండ్రాయిడ్‌ మొబైల్‌ లేని వారు లేనడంలో సందేహం లేదు. మనిషి జీవితంలో మొబైల్‌ భాగమైపోయింది. అందుకు తగ్గట్టుగానే డిజిటలైజేషన్‌ వైపు అడుగులు వేస్తున్న దేశంలో ప్రజలను ఆకర్షించేందుకు ఎన్నో కొత్తకొత్త యాప్‌లు మీ నోటిఫికేషన్‌ రూపంలో టింగ్‌..టింగ్‌ మంటున్నాయి. అయితే కొత్తగా ఉందకదా అని, లేకుంటే ఫోటోను గ్లామర్‌ చేస్తుంది కదా అని ఫోటో ఫిల్టర్‌ యాప్‌లు డౌన్‌లోడ్‌ చేసుకుంటే మీ పని అంతే. మీ వ్యక్తిగత సమాచారాన్ని సదరు యాప్స్‌ తీసుకునే అవకాశం ఉంది. దీనిపైనే గత కొన్ని రోజులు కసరత్తు చేస్తోన్న గూగుల్‌ ప్లే స్టోర్‌.. తాజా 8 యాప్స్‌ను తొలగించింది.

Food Tips : ఇలా అస్సలు తినకూడదు 

 

అయితే గత కొన్ని రోజులు నకిలీ, వ్యక్తిగత సమాచారం తస్కరించే యాప్స్‌పై నిఘా పెట్టిన గూగుల్‌ ప్లే స్టోర్‌.. అన్ని యాప్స్‌ అప్డేట్‌ చేసుకోవాలని లేకుండా ప్లే స్టేర్‌ నుంచి తొలగిస్తామని యాప్స్‌ యాజమాన్యాలకు ఉత్వర్వులు జారీ చేసింది. అయితే ఇప్పటికే గడువు ముగియడంతో.. యాప్స్‌ ఏరివేతను ప్రారంభించింది గూగుల్‌ ప్లేస్టేర్‌.. ఈ క్రమంలోనే తాజాగా వోల్గా స్టార్‌ వీడియో ఎడిటర్‌, క్రియేటివ్‌ త్రిడీ లాంచర్‌, ఫన్నీ కెమెరా, వావ్‌ బ్యూటీ కెమెరా, జీఐజీ ఈమోజీ కీబోర్డ్‌, రేజర్‌ కీబోర్డ్‌ ఎండ్‌ థీమ్‌, ఫ్రీగ్లో కెమెరా, కోకో కెమెరా యాప్స్‌ను తొలగించింది. ఈ యాప్స్‌ వ్యక్తిగత సమాచారిన్న దొంగలిస్తున్నట్లు పేర్కొంది గూగుల్‌.. అయితే ఈ యాప్స్‌ మీ ఫోన్‌లో ఉంటే వెంటనే డిలీట్‌ చేసుకొండని వినియోగదారులకు వెల్లడించింది.
 

Exit mobile version