Site icon NTV Telugu

giraffe : సింహంపై దాడి చేసిన జిరాఫీ

Girrafee

Girrafee

తన పిల్లల దగ్గరకు ఎవరైనా దాడి చేసేందుకు ప్రయత్నం చేసిన లేదా ఇబ్బందులకు గురి చేయాలని చూసిన ఏ తల్లి మనసు ఊరుకోదు.. ప్రతి రోజు మనం సోషల్ మీడియాలో ఎదో ఒక విచిత్ర ఘటనలు చూస్తునే ఉంటాం.. అలాంటి ఘటనే ఇప్పుడు మనం వింటున్నాం.. ఓ జిరాఫీ పిల్లపై కన్నేసిన ఓ సింహం ఒక్కసారిగా దానిపై దాడి చేసింది. ఇది గమనించిన తల్లి జిరాఫీ వెంటనే సింహంపైకి దూసుకెళ్లింది. దీంతో భయపడిన సింహం పిల్ల జిరాఫీని వదిలేసింది. కాగా ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా మనుషులే కాదు.. జంతువులకు ప్రేమ వర్తిస్తుందని తల్లి జిరాఫీ ప్రూవ్ చేసింది. మైదాన ప్రాంతంలో ఉన్న జిరాఫీ పిల్లపై ఓ ఆడ సింహం దూకి దాని మెడను పట్టుకుంది.

Also Read : Mlc ELections in AP: కర్నూలులో ముగిసిన ఎమ్మెల్సీ పోలింగ్.. ఎంత శాతం ఓటేశారంటే?

తప్పించుకోవడానికి జిరాఫీ పిల్ల ఎంత ప్రయత్నించిన వదలలేదు. ఒది గమనించిన తల్లి జిరాఫీ పరుగెత్తుకుంటూ వచ్చి సింహంపై దాడికి దిగింది. సింహం తన కంటే బలమైనదని తెలిసినా తెగువ చూపి తన బిడ్డపై మమకారాన్ని చాటుకుంది. తల్లి జిరాఫి రాకను గమనించిన ఆడ సింహం అక్కడి నుంచి వెల్లిపోయింది. ఈ వీడియోను యానిమాల్ వరల్డ్ 11 తన ఖాతాల పోస్ట్ చేసింది. ప్రాణాలకు తెగించి తల్లి జిరాఫీ చేసిన పోరాట పటిమను నెటిజన్లు మెచ్చుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఇలాంటి ఘటనలు చూసినప్పుడు తల్లి మనస్సు ఎంత సునీతమైందో మనం అర్థం చేసుకోవచ్చు..

Also Read : Off The Record: ఎమ్మెల్యేలు లేకున్నా.. ఏంటీ ధీమా?

Exit mobile version