పిల్లల దినోత్సవం, మదర్స్ డే, ఫాదర్స్ డే, విమెన్స్ డే వంటి వాటి గురింది అందరికీ తెలుసు. అయితే, బద్దకానికి ఓ రోజు ఉన్నది. ప్రతి ఏడాది ఆగస్టు 10 వ తేదీన జాతీయ బద్దక దినోత్సవం జరుపుకుంటారు. జాతీయ బద్దక దినోత్సవం తీసుకురావడానికి కారణం ఉన్నది. ప్రతిరోజూ మనిషి ఉరుకులు, పరుగుల జీవితంతో గడిపేస్తుంటాడు. క్షణం తీరిక లేకుండా పని పని అని తిరుగుతుంటారు. జాతీయ బద్ధక దినోత్సవం రోజున ఏలాంటి పని లేకుండా ఉండిపోవాలట. పని చేయడానికి అలవాటైన మనిషి, ఏమీ చేయకుండా ఉండమంటే ఎలా ఉండిపోతాడు. అస్సలు కుదరని పని. ఏ పని లేకుంటే మొబైల్‌లో తల దూర్చేస్తాడు.
Read: ప్రియురాలి కోసం దొంగగా మారిన ప్రేమికుడు
సైలెంట్‌గా ఉండటం అంటే ఎవరికైనా కష్టమే కదా. కొందరు మాత్రం జాతీయ బద్ధక దినోత్సవం రోజున మనలో ఇన్నర్‌గా ఉన్న టాలెంట్‌ను బయటకు తీయాలని, బొమ్మలు వేయడం, కవితలు రాయడం ఇలా ఎవరిలో ఉన్న ఇన్నర్ టాలెంట్‌ను వారు బయటపెట్టాలని అంటున్నారు. రోజంతా కష్టపడే శరీరానికి తప్పని సరిగా కొంత సమయం రెస్ట్ అవసరం. మాములు సెలవు రోజుల్లో కూడా వారితో వీరితో కలిసి అక్కడికి ఇక్కడికి వెళ్తుంటారు. అలా వెళ్లకుండా ఇంట్లో హాయిగా తినేసి నిద్రపోవడానికి ఈ జాతీయ బద్ధక దినోత్సవం ఉపయోగపడుతుందని కొంతమంది అభిప్రాయం.