Diwali Gold Sales: ఈ ఏడాది దీపావళి పండుగ.. బంగారం వ్యాపారానికి బాగా కలిసొచ్చింది. మన దేశంలో మొన్న, నిన్న రెండు రోజులు పాతిక వేల కోట్ల రూపాయల బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. గతేడాది ధన త్రయోదశితో పోల్చితే ఈసారి బంగారం, వెండి ఆభరణాల విక్రయాలు 35 శాతం అధికంగా నమోదైనట్లు అంచనా వేస్తున్నారు. పోయిన సంవత్సరం ఇదే సమయంలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర 47 వేల 644 రూపాయలు ఉండగా ఈ సంవత్సరం 52 వేల రూపాయలు పలుకుతోంది. అయినప్పటికీ కొనుగోలుదారులు దుకాణాలకు పోటెత్తుతుండటం విశేషం.
also read: Telangana temperature: తెలంగాణ వాసులు అలర్ట్.. ప్రారంభమైన చలి ప్రభావం
ధన త్రయోదశి ఈ సంవత్సరం శని, ఆదివారాలు రావటంతో బులియన్ మార్కెట్‌తోపాటు అన్ని బిజినెస్‌లకు ప్లస్ అయింది. సిటీల్లో మెజారిటీ ప్రజలు ఆన్‌లైన్‌లోనే గోల్డ్ బుక్ చేసుకొని మరీ ధన త్రయోదశి నాటికి డెలివరీ అయ్యేలా ప్లాన్ చేసుకున్నారు. నిరుటితో పోల్చితే ఇప్పుడు కనీసం 15 నుంచి 25 శాతం అధనంగా ధంతేరస్ బులియన్ అమ్మకాలు నమోదవుతాయని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఇండియా సీఈఓ సోమసుందరం తెలిపారు. ఈ సంవత్సరం బులియన్ సేల్స్‌లో 80 శాతం ఆభరణాలేనని మార్గెట్ వర్గాలు పేర్కొన్నాయి.
ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా బంగారం వ్యాపారులు పండుగ చేసుకుంటున్నారు. ఫెస్టివల్ మూడ్ సోమ, మంగళవారాల్లో కూడా కొనసాగే అవకాశం ఉండటంతో బంగారం కొనుగోళ్లు ఇంకా పెరుగుతుందనటంలో ఎలాంటి సందేహంలేదు. పండుగ నాడు పసిడి కొనటాన్ని చాలా మంది సెంటిమెంట్‌గా భావిస్తారు. ఇన్ని రోజులూ దాచుకున్న డబ్బులను బయటికి తీసి దుకాణాల వైపు అడుగులు వేస్తారు. స్తోమతకు తగ్గట్లుగా సొమ్మును సొంతం చేసుకుంటారు.