Site icon NTV Telugu

నాకు నచ్చిన ప్యానల్ కి మద్దతిచ్చిన వారికే క్యారెక్టర్లు !

ajay-bhupathi

‘మా’ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ మరింత వేడెక్కుతున్నాయి. బరిలో ఉన్నది రెండే రెండు ప్యానళ్ల సభ్యులు. ఒకటి మంచు విష్ణు ప్యానల్, రెండోది ప్రకాష్ రాజ్ ప్యానల్. ఈ రెండు ప్యానళ్ల సభ్యులు ఒకరిపై ఒకరు చేసుకుంటున్న వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయి. ఇంతవరకూ ప్రకాష్ రాజ్, మంచు విష్ణు మధ్య వార్ నడిస్తే, ఇప్పుడు కరాటే కళ్యాణి, హేమ మధ్య నడుస్తోంది. లోకల్, నాన్ లోకల్ ప్రచారం జోరుగా సాగుతోంది. బెదిరిస్తున్నారు అని ఒకరు ఆరోపిస్తే, డ్రామాలు చేస్తున్నారని మరొకరు ఆరోపిస్తున్నారు. మరి ‘మా’ సభ్యులు ఎవరికి అధ్యక్షుడి పట్టం కట్టబెడతారో ఈ అక్టోబర్ 10న జరిగే ఓటింగ్ లో తేలనుంది. అయితే ఈ ఎలక్షన్స్ పై తాజాగా ఓ యంగ్ డైరెక్టర్ కూడా స్పందించడం ఆసక్తికరంగా మారింది.

Read Also : “భీమ్లా నాయక్” టీంకు షాకింగ్ రెమ్యూనరేషన్… ఎవరెవరికి ఎంతంటే ?

“ఆర్ఎక్స్ 100″తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న అజయ్ భూపతి. ప్రస్తుతం తన రెండవ ప్రాజెక్ట్ “మహా సముద్రం”తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాడు. అయితే తాజాగా ఆయన “మా” ఎన్నికలపై ఇన్ డైరెక్ట్ కౌంటర్ వేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. “నాకు నచ్చిన ప్యానల్ కి మద్దతిచ్చిన వారికే క్యారెక్టర్లు రాస్తా…(అని నాతో ఇప్పుడే ఒక డైరెక్టర్ అన్నాడు)” అంటూ ట్వీట్ చేశారు అజయ్. ఈ మాట ఆయన మనసులోనిదా ? లేదంటే ఎవరన్నా ఆయనతో ఎవరన్నా నిజంగానే అన్నారా ? అంటే ఎవరు ? అని నెటిజన్లు ఈ డైరెక్టర్ ను ప్రశ్నిస్తున్నారు.

Exit mobile version