NTV Telugu Site icon

Snake In Amazon Order: అమెజాన్ ప్యాకేజీలో కోబ్రా.. వీడియో వైరల్

Snake

Snake

Snake In Amazon Order: బెంగళూరు ( Bengaluru )లోని ఓ జంట ఆదివారం అమెజాన్ లో ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన ప్యాకేజీలో పాము కనిపించడంతో షాక్ అయ్యారు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌లైన దంపతులిద్దరూ ఆన్‌లైన్‌ లో ఎక్స్‌ బాక్స్ కంట్రోలర్‌ ను ఆర్డర్ చేశారు. అయితే వారికి అమెజాన్ ప్యాకేజీలో ఉన్న నాగుపామును చూసి షాక్ అయ్యారు. విషపూరితమైన పాము అదృష్టవశాత్తూ ప్యాకేజింగ్ టేప్‌కు అంటుకపోవడంతో హాని కలిగించలేదు. ఇందుకు సంబంధించి ఆ జంట ఓ వీడియోను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Mercedes Car Accident : డెలివరీ బాయ్ మీదకి దూసుకెళ్లిన మెర్సిడెస్ కారు.. వైరల్ వీడియో

తాము 2 రోజుల క్రితం అమెజాన్ నుండి ఎక్స్‌ బాక్స్ కంట్రోలర్‌ను ఆర్డర్ చేసాము. అయితే ఆర్డర్ వచ్చిన దానిని ఓపెన్ చేసి చూడగా ప్యాకేజీలో బతికి ఉన్న నాగుపామును పొందాము. ప్యాకేజీని డెలివరీ భాగస్వామి నేరుగా మాకు అందజేసారు. మేము సర్జాపూర్ రోడ్డులో నివసిస్తున్నాము. తాము మొత్తం సంఘటనను కెమెరాలో బంధించాము. దానికి తోడు మాకు ప్రత్యక్ష సాక్షులు ఉన్నారని సంబంధిత బాధితుడు సోషల్ మీడియాలో వాపోయాడు. అదృష్టవశాత్తూ, పాము ప్యాకేజింగ్ టేప్‌కు ఇరుక్కుపోయింది. దాంతో మా ఇంట్లో అపార్ట్‌మెంట్‌లో ఎవరికీ హాని కలిగించలేదు అంటూ తెలిపారు. ఇంకా ఈ విషయంపై అమెజాన్ ప్రతినిధులతో సంప్రదించగా వారి నుండి ప్రతిస్పందన పొందారు.

AIS App : ట్యాక్స్ చెల్లింపుదారులకు కోసం కొత్త యాప్.. ఎలా వాడాలంటే

కస్టమర్ వీడియోపై స్పందిస్తూ అమెజాన్ ఇండియా కంపెనీ ట్వీట్ చేసింది. అమెజాన్ ఆర్డర్‌తో మీకు కలిగిన అసౌకర్యం గురించి తెలుసుకున్నందుకు మమ్మల్ని క్షమించండి. మేము దీన్ని తనిఖీ చేయాలనుకుంటున్నాము. దయచేసి అవసరమైన వివరాలను ఇక్కడ భాగస్వామ్యం చేయండి. విషయాలను మా బృందం పొందుతుంది. ఇందుకు సంబంధించి అప్డేట్ తో త్వరలో మీ వద్దకు తిరిగి వస్తాము అంటూ తెలిపింది. ఇక పామును ప్రజలకు అందుబాటులో లేకుండా ఎక్కడో సురక్షితంగా వదిలేశారు.