చాక్లెట్స్ అంటే ఇష్టపడని వాళ్లు ఉండరు.. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా వీటిని ఇష్టంగా తింటారు.. ప్రేమికుల రోజు కారణంగా ఫిబ్రవరిని ప్రేమ నెలగా పరిగణిస్తారు. వాలెంటైన్స్ వీక్ సందర్భంగా ఫిబ్రవరి 9న చాక్లెట్ డే జరుపుకుంటారు. ఈ రోజున మీ ప్రియమైన వ్యక్తికి చాక్లెట్ బహుమతిగా ఇస్తుంటారు. జీవితంలో ప్రత్యేక సంతోషకరమైన సందర్భాలను చాక్లెట్లతో జరుపుకుంటారు.. అయితే ప్రపంచంలో కెల్లా అత్యంత ఖరీదైన చాక్లెట్స్ కూడా ఉన్నాయి.. అసలు ఆలస్యం చెయ్యకుండా అవేంటో ఒకసారి చూసేద్దాం..
ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో రకాల చాక్లెట్స్ ఉంటాయి.. అందులో కొన్ని మాత్రం ఇంకా ఇంకా తినాలని అనిపిస్తాయి.. ప్రపంచ చాక్లెట్ దినోత్సవాన్ని జూలై 7 న జరుపుకుంటారు. అంతే కాకుండా ఫిబ్రవరిలో వాలెంటైన్స్ వీక్ సందర్భంగా ఫిబ్రవరి 9న చాక్లెట్ డే జరుపుకుంటారు. ప్రపంచ చాక్లెట్ దినోత్సవాన్ని 2009లో మొదటిసారిగా జరుపుకున్నారు. 1550లో ఇదే రోజున ఐరోపాలో తొలిసారిగా చాక్లెట్‌ను విడుదల చేశారు.. అందుకే ఆ రోజును చాక్లెట్ డే గా ప్రకటించారు.. ఇప్పుడు అత్యంత ఖరీదైన చాక్లెట్స్ ఏంటో తెలుసుకుందాం..
డి లాఫే గోల్డ్ చాక్లెట్ బాక్స్ ప్రత్యేకం. 24 క్యారెట్ల బంగారంతో హైలైట్ చేయబడిన ఈ చాక్లెట్ బాక్స్‌లో 1919 నుండి 1920 వరకు అసలైన బంగారు నాణేలు ఉంటాయి.. దీని రుచి కూడా చాలా బాగుంటుందట.. అలాంటి చాక్లేట్ ధర 38 వేలు.. లే చాక్లెట్స్ బాక్స్. ఇది ఇంకా ఖరీదైన చాక్లెట్స్..వజ్రాల నెక్లెస్, ఉంగరాలు మరియు కంకణాలు వజ్రాలు, పచ్చలు మరియు నీలమణితో తయారు చేస్తారు. ఈ చాక్లెట్ బాక్స్ ధర రూ. 11 కోట్ల 20 లక్షలు.. ఫ్రోజెన్ హాట్ ప్రపంచ చరిత్రలో అత్యంత ఖరీదైన చాక్లెట్‌లలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఇది గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో అత్యంత ఖరీదైన చాక్లెట్‌గా జాబితా చేయబడింది.. దీని ధర 18 లక్షల 68 వేల రూపాయలు ఖర్చు చేయాలి. గోల్డెన్ స్పెక్లెడ్ చాక్లెట్ చాక్లెట్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో జాబితా చేయబడింది. ఇవే కాదు ఇంకా చాలా చాక్లెట్స్ అందుబాటులో ఉన్నాయి..