దెయ్యాలు ఉన్నాయా లేదా అంటే ఎవరైనా ఏం చెప్తారు చెప్పండి. దెవుడు ఉన్నాడని నమ్మినపుడు దెయ్యాలు కూడా ఉన్నాయని నమ్మాల్సిందే కదా. దెయ్యాలు ఉన్నాయని మనమే కాదు రాజకీయ నాయకులు కూడా బలంగా నమ్ముతుంటారు. కొలంబియాలోని ఆర్మేనియా సిటి మేయర్ ఇటీవలే ఓ వీడియోను షేర్ చేశాడు. తన ఆఫీసులో పనిచేసే సెక్యూరిటీ గార్డు నడుచుకుంటూ వస్తుండగా హఠాత్తుగా ఎవరో వచ్చి కొట్టినట్టుగా ఉండటంతో ఎగిరి అవతల పడ్డాడు. ఆ దెబ్బకు అక్కడ కొన్ని వస్తువులు పగిలిపోయాయి. దెయ్యం కాక ఇంకెవరు అలా కొట్టి ఉంటారని మేయర్ జోస్ మ్యాన్యుల్ పేర్కొన్నారు. దీనికి సంబందించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది.
వైరల్: సెక్యూరిటీ గార్డ్ బుర్ర బద్దలు కొట్టిన దెయ్యం…
