Site icon NTV Telugu

Kidney Sale for IPhone : ఐఫోన్ కోసం కిడ్నీ అమ్ముకున్న యువకుడు.. ఇప్పుడు జీవితాంతం వికలాంగుడిగా

Iphone

Iphone

చైనాలో ఒకప్పుడు సంచలనం రేపిన ఘటన ఇప్పుడు మళ్లీ వార్తల్లోకి వచ్చింది. 2011లో, కేవలం 17 ఏళ్ల వయసులో వాంగ్ షాంగ్‌కున్ అనే యువకుడు తన కిడ్నీని అమ్ముకుని ఐఫోన్ 4, ఐపాడ్ 2 కొనుగోలు చేశాడు. అన్హుయ్ ప్రావిన్స్‌కి చెందిన వాంగ్, అప్పట్లో 20,000 యువాన్‌ (సుమారు ₹2.5 లక్షలు)కు ఒక కిడ్నీని విక్రయించాడు. లగ్జరీ గాడ్జెట్‌లు తనవవడంతో ఆ యువకుడు ఆనందపడ్డాడు.

కానీ ఆ ఆనందం తాత్కాలికమే. సరైన వైద్య పద్ధతులు పాటించకుండా జరిగిన శస్త్రచికిత్స కారణంగా తీవ్రమైన ఇన్ఫెక్షన్‌ వచ్చింది. మిగిలిన కిడ్నీ కూడా దెబ్బతింది. కొద్దికాలానికే అతనికి కిడ్నీ వైఫల్యం వచ్చింది. ఇప్పుడు వాంగ్ వయసు 31 ఏళ్లు. అతను పూర్తిగా వికలాంగుడిగా మారి, రోజువారీ జీవితం కొనసాగించడానికి డయాలిసిస్ యంత్రంపైనే ఆధారపడుతున్నాడు. ఒకప్పుడు చైనాలో అత్యంత షాకింగ్‌గా నిలిచిన ఈ ఘటన, అక్రమ అవయవ వ్యాపారం ఎంతటి ప్రమాదకరమో స్పష్టంగా చూపించింది. ఒక గాడ్జెట్ కోరికతో తీసుకున్న తొందరపాటు నిర్ణయం అతని జీవితాన్ని శాశ్వతంగా మార్చేసింది.

Shocking: అల్లరి చేస్తుందని హత్య.. మాదన్నపేటలో బాలిక హత్య కేసులో సంచలనం..

Exit mobile version