Site icon NTV Telugu

Viral News : గేదెకు రూ.14 లక్షలు.. అరేయ్ ఏంట్రా ఇది..

Viral News

Viral News

Viral News : సాధారణంగా ఒక గేదె ధర ఎంత ఉంటుంది. మహా అయితే ముర్రాజాతి గేదెలకు ఎంత లేదన్నా రూ.1 లక్ష నుంచి రెండు లక్షల వరకు ఉంటుంది. అంతకంటే ఎక్కువ ఉండదు కదా. కానీ ఇప్పుడు ఓ గేదె ఏకంగా రూ.14 లక్షల వరకు పలికింది. మరీ అంతనా అని షాక్ అవకండి. ఎందుకంటే ఆ గేదె స్పెషాలిటీ అలా ఉంటుంది మరి. ఇది బన్నీ జాతికి సంబంధించిన గేదె. మన దేశంలో ఈ జాతికి చెందిన గేదెలు చాలా తక్కువగానే ఉన్నాయి. పైగా నార్త్ లోనే ఇవి ఉన్నాయి.

read also : Dilraju : రామ్ చరణ్‌ వల్లే నష్టాల నుంచి బయటపడ్డా

గుజరాత్‌లోని కచ్‌ జిల్లాలో లఖ్‌పత్‌ తాలూకాలోని సంధ్రో గ్రామానికి చెందిన గజీ హాజీ అలాదాద్‌ తన వద్ద ఉన్న ఈ బన్నీ జాతి గేదెను అమ్మకానికి పెట్టాడు. సెర్వా గ్రామానికి చెందిన షెరుబాయ్‌ బాలు ఆ గేదెను ఏకంగా రూ.14.1 లక్షల రికార్డు ధరకు కొన్నాడు. ఈ గేదెలు రోజుకు 12 నుంచి 18 లీటర్ల పాలనిస్తాయి. చూడటానికి దిట్టంగా నల్లగా ఉంటాయి. వీటికి అనారోగ్య సమస్యలు చాలా తక్కువగా వస్తాయి. ఆరోగ్యంగా ఉంటూ నాణ్యమైన పాలను ఇస్తాయి. అందుకే వీటికి ఇంతటి ధర ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. పైగా గుజరాత్ లో ఈ గేదె పాలకు డిమాండ్ కూడా చాలా ఎక్కువే ఉంది.

read also : Star Directors : ఈ స్టార్ డైరెక్టర్లకు ఏమైంది.. ఇక సినిమాలు తీయరా..?

Exit mobile version