Site icon NTV Telugu

హ్యుందాయ్‌పై తీవ్ర‌ప్ర‌భావం చూపిన ఆ పోస్ట్‌… నెటిజ‌న్లు తీవ్ర ఆగ్ర‌హం…

దేశంలో ఎక్కువ కార్ల‌ను త‌యారు చేసే కంపెనీల్లో హ్యుందాయ్ ఒక‌టి. ప్ర‌పంచ‌లో హ్యుందాయ్ కంపెనీకి భార‌త్ అతిపెద్ద మార్కెట్‌. ఇండియాలో అనేక ప్రాంతాల్లో ఈ కంపెనీ త‌న ప్లాంట్ల‌ను ఏర్పాటు చేసిన సంగ‌తి తెలిసిందే. ఇక్క‌డ త‌యార‌య్యే కార్ల‌కు ప్ర‌పంచంలో డిమాండ్ అధికంగా ఉంటున్న‌ది. అయితే, హ్యుందాయ్ పాకిస్తాన్ ట్విట్ట‌ర్లో చేసిన ఓ పోస్ట్ దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారింది. బాయ్‌కాట్ హ్యుందాయ్ పేరుతో ట్రెండ్ అయింది. పాకిస్తాన్‌లో హ్యుందాయ్ కంపెనీ అధికారిక ఖాతా ట్విట్ట‌ర్‌లో కాశ్మీర్‌పై ఓ పోస్ట్ చేసింది. కాశ్మీర్ కోసం ప్రాణాల‌ర్పించిన వారిని స్మ‌రించుకుందాం స్వాతంత్య్రం కోసం వారు చేస్తున్న పోరాటానికి అండ‌గా నిలుద్దామం అని చెప్పి పోస్ట్ చేసింది. ఈ పోస్టింగ్ ఇప్పుడు వివాదానికి దారితీసింది.

Read: ఊ అంటావా ఉహు అంటావా అంటున్న వ‌ధూవ‌రులు… నెటిజ‌న్లు ఫిదా…

ఈ పోస్టింగ్ కాశ్మీర్ వేర్పాటువాదులకు మ‌ద్ద‌తు ఇచ్చేలా ఉంద‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేయ‌డం మొద‌లుపెట్టారు. సామాన్య ప్ర‌జ‌ల నుంచి రాజ‌కీయ నేత‌ల వ‌ర‌కు హ్యుందాయ్ కంపెనీపై విమ‌ర్శ‌లు చేయ‌డం మొద‌లుపెట్టారు. అయితే, పోస్ట్ చేసిన కాసేప‌టికీ హ్యుందాయ్ కంపెనీ ఆ పోస్టింగ్‌ను డిలీట్ చేసింది. అయిన‌ప్ప‌టికీ ఆ కంపెనీ షేర్ చేసిన పోస్టింగ్ కు సంబంధించిన స్క్రీన్ షాట్లు సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ కామెంట్లు చేశారు. దీంతో దిగొచ్చిన హ్యుందాయ్ కంపెనీ భార‌త్‌లో 25 ఏళ్లుగా త‌మ కార్య‌క‌లాపాలు సాగిస్తున్నామ‌ని, జాతీయ‌వాదానికి తాము ఎప్పుడూ క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని, సున్నిత‌మైన విష‌యాల్లో తాము క‌ఠినంగా ఉంటామ‌ని వివ‌ర‌ణ ఇచ్చింది. అయితే, హ్యుందాయ్ పాకిస్తాన్ ట్విట్ట‌ర్ హ్యాండిల్ నుంచి చేసిన పోస్టింగ్‌ను ఖండిస్తున్న‌ట్టు వివ‌ర‌ణ‌లో పేర్కొన‌క‌పోవ‌డంతో ఈ వివాదంపై మ‌రింత దుమారం రేగింది. బీజేపీ, శివ‌సేన నేత‌లు హ్యుందాయ్ వివ‌ర‌ణ‌పై అసంతృప్తిని వ్య‌క్తం చేశారు. వివ‌ర‌ణ సంతృప్తిక‌రంగా లేద‌ని, హ్యుందాయ్ కంపెనీ క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేశారు.

Exit mobile version