తెలుగు బిగ్ బాస్ కన్నా బాలివుడ్ బిగ్ బాస్ మరీ దారుణంగా ఉంటుందన్న విషయం మరోసారి నిరూపితం అయ్యింది.. లైవ్ లో అందరు చూస్తుండగానే ఓ జంట లిప్ లాక్ తో రెచ్చిపోయింది.. రియాలిటీ షోలో రియల్ గానే కానిచ్చేసి అందరికి షాక్ ఇచ్చారు. అందుకు సంబందించిన వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
ప్రస్తుతం హిందీ బిగ్ బాస్ ఓటీటీ స్ట్రీమింగ్ సీజన్ 2 నడుస్తుంది. రీసెంట్ గా మొదలైన ఈ సీజన్ టీవీల్లో వచ్చే ఎపిసోడ్ లానే భారీ హంగామా చేస్తుంది. ఇక షో మొదలైన కొన్నాళ్లకే కొంతమంది జోడీగా ఏర్పడ్డారు. బిగ్ బాస్ హిందీ ఓటీటీ సీజన్ 2లో ఆకాంక్ష అండ్ జేద్ మొదటి నుంచి క్లోజ్ గా ఉంటున్నారు. ఇక లేటెస్ట్ గా వారు ఒక టాస్క్ లో భాగంగా లిప్ లాక్ కూడా చేసుకున్నారు. లిప్ లాక్ అంటే ఏదో ఇలా ముద్దు పెట్టడం కాదు దాదాపు నిమిషం పాటు లిప్ కిస్ చేస్తూ ఒకరినొకరు ఆధీనంలోకి తెచ్చుకున్నారని వీడియోను చూస్తే అర్థమవుతుంది..
ఆ తర్వాత సేమ్ ఇదే టాస్క్ ను మరికొంత మంది కంటెస్టెంట్స్ చేశారు. అయితే తాజాగా వీడియో వైరల్ కావడంతో ఇది చూసిన నెటిజన్లు ఇవేం టాస్క్ లు అంటూ షో నిర్వాహకులపై ఫైర్ అవుతున్నారు. సమాజంపై ఎఫెక్ట్ చూపే ఈ పిచ్చి పనులు ఏంటని మండి పడుతున్నారు. అంతకు ముందు ఇదే షోలో జైద్ హదీద్ పూరి ఆకాంక్షను తప్పుగా తాకినప్పుడు ఆమె గొడవకు దిగింది. తాజాగా ముద్దుల వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.. ఇక దీన్ని చూసినవారంతా కూడా ఓ రేంజులో ఇచ్చుకున్నారు.. నెటిజన్లు నోటికి అదుపులేకుండా రెచ్చిపోయారు..బిగ్ బాస్ ఓటీటీ మొదలైన కొన్నాళ్లకే లిప్ లాక్ అంటే ఇంకా రానున్న రోజుల్లో చాలా జరుగుతాయని అంటున్నారు.. ఇక ముందు ముందు ఎలాంటివి చూడాలో అని కొందరు అంటుంటే.. మరికొందరు ఇంకాస్త పెంచితే బాగుండు అంటూ రకరకాల కామెంట్స్ తో రచ్చ చేస్తున్నారు.. మొత్తానికి ఈ వీడియో మాత్రం నెట్టింట చక్కర్లు కొడుతుంది.. వీరిద్దరిపైనే తెరపై చర్చ మొదలైంది.. ఇక ఆలస్యం ఎందుకు కింద ఆ వీడియోను ఒకసారి చూసేయ్యండి..
#SalmanKhan had said he will let #BiggBossOTT2 contestants cross the line, Lets see who he reacts to this Kiss by #AkankshaPuri and #JadHadid pic.twitter.com/ZFV1h3J80d
— The Khabri (@TheKhabriTweets) June 29, 2023